[racchabanda] రచ్చబండ కవితలు

 

Requited Manifold  

 

ఒక జిలుగు మాటకు

కన్నుల మస్కారా తీర్చి

 

ఒక ఘుమ్మను మాటకు

జవ్వాజి జల్లుకుని

 

ఒక నవమైన మాటకు

నూతన వస్త్రాలు, నగలు ధరించి

 

ఒక ఆవేగపు మాటకు

మోటరు నడుపుకు gala కి వెడితే;

 

చూచిన ఇతరులు -వారామెను

"You look Fabulous!" -అన్నారు.

 

ఆమెకు తెలుసు ఆ పొగడ్త

నిజానికి ఎవరికి చెందేదీ.

She knows.

 

-Lyla__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (233)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] కర్ణాటక త్రిపదులు #karNATaka tripadulu#

 

కర్ణాటక త్రిపదులు - 

పాదము 1 - వి/వి - వి/వి (ప్రాస యతి)
పాదము 2 - వి/బ్ర/వి - వి
పాదము 3 - వి/బ్ర/వి 

వి - విష్ణు గణము = ఇంద్ర గణము + UUU, IIUU
బ్ర - బ్రహ్మ గణము = సూర్య గణము + UU, IIU

పగలెట్లొ ముగియఁగాఁ - బగవోలె నీరాత్రి 
రగులంగ మనసు, పొగ రేక - లెగురంగ 
గగనమ్ము దాఁకు తాపగా 
(తాప = నిచ్చెన)

శ్రుతి తప్పినది పాట - గతి తప్పినది మన్కి 
యతి తప్పినదియొ గీతికి - ధృతి లేక 
మతి తప్పినదియొ నాకిందు 

ఎదనుండి పాడితిన్ - బదము నేనానాఁడు 
మదిలోన నిలిచె నాపాట - ముదమందు 
వ్యధలందు నన్ను వదలక 

గోవింద చూడుమా - మావంక నొకమారు 
జీవాల శవము నడయాడు - ద్రోవలో 
నేవెల్గు లేని చీఁకట్లు

విధేయుడు - మోహన 
#
karNATaka tripadulu - 

pAdamu 1 - vi/vi - vi/vi (prAsa yati)
pAdamu 2 - vi/bra/vi - vi
pAdamu 3 - vi/bra/vi 

vi - vishNu gaNamu = iMdra gaNamu + #UUU, IIUU#
bra - brahma gaNamu = sUrya gaNamu + #UU, IIU#

pagaleTlo mugiya@MgA@M - bagavOle nIrAtri 
ragulaMga manasu, poga rEka - leguraMga 
gaganammu dA@Mku tApagA 
(tApa = nichchena)

Sruti tappinadi pATa - gati tappinadi man&ki 
yati tappinadiyo gItiki - dhRti lEka 
mati tappinadiyo nAkiMdu 

edanuMDi pADitin - badamu nEnAnA@MDu 
madilOna niliche nApATa - mudamaMdu 
vyadhalaMdu nannu vadalaka 

gOviMda chUDumA - mAvaMka nokamAru 
jIvAla Savamu naDayADu - drOvalO 
nEvelgu lEni chI@MkaTlu

vidhEyuDu - mOhana 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] Must read article చంపకోత్పలమాలలు - మధ్యాక్కర - అక్షరోత్పలము #chaMpakOtpalamAlalu - madhyAkkara - axarOtpalamu#

 

చంపకోత్పలమాలలు - మధ్యాక్కర - అక్షరోత్పలము - 

ఉ. ఎందుకు చూడవో ననిట - నిందువుఁ బోలు ప్రియాంగి ప్రేమతోఁ  
బొందికతోడ నుండగను - ముందుగ రమ్ము శుభాంగి శోభతో 
మందిర మీమనస్సు నిన-మందముగాను వరించె నిక్కమై 
సుందరి రమ్ము రాత్రి యతి - సుందరమై వికసించెఁ జొక్కమై 

ఇది ఒక ఉత్పలమాల, ఒక ప్రత్యేకమైన విధముగా వ్రాయబడినది. చివరి మూడు అక్షరాలు తనంతట తామే నిలిచి ఉన్నాయి. వాటిని తొలగిస్తే మనకు ఒక మధ్యాక్కర లభిస్తుంది. క్రింద ఆ మధ్యాక్కర - 

ఎందుకు చూడవో ననిట - నిందువుఁ బోలు ప్రియాంగి 
బొందికతోడ నుండగను - ముందుగ రమ్ము శుభాంగి 
మందిర మీమనస్సు నిన-మందముగాను వరించె 
సుందరి రమ్ము రాత్రి యతి - సుందరమై వికసించె 

అనగా చంపకోత్పలమాలలలో మధ్యాక్కరను గర్భితము చేయుటకు వీలగును. బహుశా మధ్యాక్కరకు తఱువాతి కాలములోని యతి నిర్ణయము ఇలాగే వచ్చినదేమో? ఇప్పుడు దీనికి వ్యతిరేక ప్రక్రియను చేద్దామా? మధ్యాక్కర చివర గుర్వంతమైన ఒక పంచమాత్రను, అనగా ర-గణము లేక నగమును ఉంచి వ్రాస్తే అందులో కొన్నిటికి ఈ మాలికా వృత్తముల ఛాయలు ఉండవచ్చును. ఇట్టి జాతి పద్యమునకు అక్షరోత్పలము అని పేరు పెట్టినాను. క్రింద కొన్ని ఉదాహరణములు - 

అక్షరోత్పలము - మధ్యాక్కర + ర-గణము లేక న-గము

మనసొక మల్లెల తీఁగ - మధుపము లెప్పుడుఁ జేరు మధువుకై 
తనువొక తంత్రుల వీణ - తాళము తప్పక పాడు మధురమై 
నిను గనఁ గన్నులు చూచు - నింగిని దాఁకఁగ లేచు ముదములో 
వనజము హృదయము నీది - వనజముఖా యిది యాది బ్రతుకులో 

మదుమాసమున బూయు బువ్వు - మధురేశుఁ బెదవిపై నవ్వు రంగులే 
మదిలోన నలవోలెఁ దలఁపు - మమతానురాగాల వలపు రంగులే 
ఇది యయ్యె బ్రతుకులో బంధ - మిది యయ్యె దివ్యాను బంధ మసమమై  
నదియయ్యె నానంద మదియు - నవమయ్యెఁ బికరావ మదియుఁ గవనమై 

నాలుగు నేత్రము లిపుడు - నవ్వుచు రెండుగ నయ్యె హాయిలో 
మేలగు రెండు మనసులు - మిన్నగ నొక్కటి యయ్యె మాయలో 
కాలము మెల్లఁగ నడచెఁ - గాముని సన్నిధిలోన మోదమై 
నేలయు నాకస మొకటి - నిర్ణయ మావిధి దింక వేదమై 
(దీనికి ఉత్పలమాలకు ఒకే భేదము; ర-గణమునకు బదులు భ-గణము, దీనివలన అన్నియు చతుర్మాత్రలు మధ్యాక్కర భాగములో.) 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chaMpakOtpalamAlalu - madhyAkkara - axarOtpalamu - 

u. eMduku chUDavO naniTa - niMduvu@M bOlu priyAMgi prEmatO@M  
boMdikatODa nuMDaganu - muMduga rammu SubhAMgi SObhatO 
maMdira mImanassu nina-maMdamugAnu variMche nikkamai 
suMdari rammu rAtri yati - suMdaramai vikasiMche@M jokkamai 

idi oka utpalamAla, oka pratyEkamaina vidhamugA vrAyabaDinadi. chivari mUDu axarAlu tanaMtaTa tAmE nilichi unnAyi. vATini tolagistE manaku oka madhyAkkara labhistuMdi. kriMda aa madhyAkkara - 

eMduku chUDavO naniTa - niMduvu@M bOlu priyAMgi 
boMdikatODa nuMDaganu - muMduga rammu SubhAMgi 
maMdira mImanassu nina-maMdamugAnu variMche 
suMdari rammu rAtri yati - suMdaramai vikasiMche 

anagA chaMpakOtpalamAlalalO madhyAkkaranu garbhitamu chEyuTaku vIlagunu. bahuSA madhyAkkaraku ta~ruvAti kAlamulOni yati nirNayamu ilAgE vachchinadEmO? ippuDu dIniki vyatirEka prakriyanu chEddAmA? madhyAkkara chivara gurvaMtamaina oka paMchamAtranu, anagA ra-gaNamu lEka nagamunu uMchi vrAstE aMdulO konniTiki ee mAlikA vRttamula ChAyalu uMDavachchunu. iTTi jAti padyamunaku axarOtpalamu ani pEru peTTinAnu. kriMda konni udAharaNamulu - 

axarOtpalamu - madhyAkkara + ra-gaNamu lEka na-gamu

manasoka mallela tI@Mga - madhupamu leppuDu@M jEru madhuvukai 
tanuvoka taMtrula vINa - tALamu tappaka pADu madhuramai 
ninu gana@M gannulu chUchu - niMgini dA@Mka@Mga lEchu mudamulO 
vanajamu hRdayamu nIdi - vanajamukhA yidi yAdi bratukulO 

madumAsamuna bUyu buvvu - madhurESu@M bedavipai navvu raMgulE 
madilOna nalavOle@M dala@Mpu - mamatAnurAgAla valapu raMgulE 
idi yayye bratukulO baMdha - midi yayye divyAnu baMdha masamamai  
nadiyayye nAnaMda madiyu - navamayye@M bikarAva madiyu@M gavanamai 

nAlugu nEtramu lipuDu - navvuchu reMDuga nayye hAyilO 
mElagu reMDu manasulu - minnaga nokkaTi yayye mAyalO 
kAlamu mella@Mga naDache@M - gAmuni sannidhilOna mOdamai 
nElayu nAkasa mokaTi - nirNaya mAvidhi diMka vEdamai 
(dIniki utpalamAlaku okE bhEdamu; ra-gaNamunaku badulu bha-gaNamu, dInivalana anniyu chaturmAtralu madhyAkkara bhAgamulO.) 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___