ఐటీ ని పరిపాలనలో మరియు రాష్ట్రాభివృద్దికి ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.
ఈ -గవర్నెన్స్‌పై దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈ- కార్యాలయాన్ని ప్రారంభించారు.
డిజిటల్ సంతకంతో తొలి ఫైల్‌ను క్లియర్ చేశారు. అతి త్వరలో సచివాలయంలో అన్ని కార్యాలయాలను ఈ- ఆఫీస్‌తో అనుసంధానం చేయడానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
సచివాలయంలో 30 శాఖలు ఉండగా వాటిలో 10 శాఖలను ఈ ఆఫీస్‌గా మార్చారు. వ్యవసాయం, ఆర్థిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి, సంక్షేమం శాఖలు, న్యాయశాఖ, హౌసింగ్, ఐటీ, సివిల్ సప్లయ్‌తోపాటు సీఎం, సీఎస్ కార్యాలయాలు ఈ ఆఫీస్‌తో అనుసంధానం అయ్యాయి.
దీనియొక్క ముఖ్య లక్ష్యం..ప్రతి ఫైల్‌ను వేగంగా క్లియర్ చేయడమే.