శుక్రవారం హైదరాబాద్ లోని నేక్లెస్‌ రోడ్డులో డ్రైవర్స్‌ కం. ఓనర్స్‌ పథకం కింద 303 మందికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కార్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ... పేరుకు మహానగరం అయినప్పటికీ ఓ పద్ధతి ప్రకారం లేదని... హైదరాబాద్ ని భూ మాఫియాగాల్లు, రౌడీలు, కబ్జాకోరులు నాశనం చేశారని అన్నారు. హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

రాష్ట్రంలో నెలకొల్పబోయే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ కోసం స్థలం కేటాయిస్తామని... 2018లో ఐటీ సదస్సును ఘనంగా నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.