సీపీఎం నేత మాకినేని బసవపున్నయ్య శత జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడ లో జరిగిన 'రాజధాని నిర్మాణం పాలన కోసమా? ప్రతిష్ట కోసమా?' అనే సదస్సులో రాఘవులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని... సీఆర్డీఎ చట్టాన్ని అనేక లొసుగులతోనే అసెంబ్లీలో ఆమోదించారని... ఇది కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా, రైతులకు నష్టం కలిగించేలా ఉందని అన్నారు. ఈ చట్టం వల్ల గ్రామ పంచాయతీలు హక్కులు కోల్పోతాయని రాఘవులు అన్నారు.
ప్రపంచంలో విఫలమైన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఇక్కడ చంద్రబాబు అమలు చేస్తున్నారని...రాజధాని పేరుతో గ్రామాల్లో జరిగిన భూముల క్రయవిక్రయాల్లో భారీ కుంభకోణం ఉందని... దానిపై సమగ్ర విచారణ జరిపించాలని బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజధాని జోన్లో భూములు అమ్ముకున్న రైతులకు దక్కింది అతి తక్కువ ధర అని.. మధ్యవర్తులు, రాజకీయ నేతలు, కార్పొరేట్ శక్తులకు మాత్రం భారీ లాభం చేకూరిందని ఆయన అన్నారు.