ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ ను గురువారం ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు.
2015-16 కు గాను మొత్తం రూ.1,13049 కోట్ల బడ్జెట్ అని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
ఇక ఈ బడ్జెట్ లో ప్రణాళికా వ్యయం రూ.34,412 కోట్లు కాగా.... ప్రణాళికేతర వ్యయం రూ.78,637 కోట్లు అని మంత్రి తెలిపారు.
అదేవిధంగా రెవెన్యూ లోటు రూ.7300 కోట్లు, ఆర్థిక లోటు రూ.17,584 కోట్లుగా నిర్ణయించినట్లు యనమల తెలిపారు.
ఏ శాఖకు ఎంతెంత?
- గ్రామీణాభివృద్ధి (రూ.8212కోట్లు)
- శాంతిభద్రతలు (రూ.4062కోట్లు)
- రెవెన్యూశాఖ (రూ.1429కోట్లు)
- ఇంధనశాఖ (రూ.4360కోట్లు)
- ఉన్నత విద్య (రూ.3049కోట్లు)
- పాఠశాల విద్య (రూ.14962కోట్లు)
- వైద్య, ఆరోగ్యశాఖ (రూ.5728కోట్లు)
- పౌరసరఫరాల శాఖ (రూ.2459కోట్లు)
- రోడ్లు భవనాల శాఖ (రూ.2960కోట్లు)
- పంచాయతీరాజ్‌ (రూ.3296కోట్లు)
- గిరిజన సంక్షేమం (రూ.3231కోట్లు)
- సాంఘిక సంక్షేమం (రూ.2123కోట్లు)
- నీటిపారుదల శాఖ (రూ.5258కోట్లు)
- స్త్రీ, శిశు సంక్షేమానికి గాను (రూ.1080కోట్లు)
- దేవాదాయశాఖ (రూ.200కోట్లు)
- మైనింగ్‌శాఖ (రూ.27కోట్లు)
- రవాణాశాఖ (రూ.122కోట్లు)
- విపత్తుల నిర్వహణకు (రూ.488కోట్లు)
- అటవీశాఖ (రూ.284కోట్లు)
- కార్మికశాఖ (రూ.281కోట్లు)
- యువజన క్రీడలు (రూ.45కోట్లు)
- ఐటీకి (రూ.370కోట్లు)
- స్కిల్ డెవలప్ మెంట్ (రూ.360కోట్లు)
- పర్యాటక, సాంస్కృతిక రంగానికి (రూ.330కోట్లు)
- పరిశ్రమలు-వాణిజ్యం (రూ.637కోట్లు)
- మౌలికసదుపాయాలు-పెట్టుబడులకు (రూ.195కోట్లు)
- గ్రామీణ నీటిసరఫరాకు (రూ.881కోట్లు)
- ఇంటర్మీడియట్‌ విద్యకు (రూ.587కోట్లు)
- గృహనిర్మాణానికి (రూ.897కోట్లు)
- చేనేత-జౌళికి (రూ.46కోట్లు)
- వికలాంగులు-వృద్ధులకు (రూ.45కోట్లు)
- మైనార్టీ సంక్షేమానికి (రూ.379కోట్లు)