అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పై పలు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని....చంద్రన్న కానుకల పేరుతో రూ. 350 కోట్లు వృథా అయ్యాయని జేసీ విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది కేవలం ఎన్నికల స్టంటు మాత్రమేనని...ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం తనకు పోయాయని... కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వచ్చని అన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకూ పనికిరాకుండా పోయారని...ప్రజాధనంతో నిర్వహిస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు వృథా అవుతున్నాయని జేసీ అన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఆందోళన చేయాలన్న పవన్ కల్యాణ్ సూచన మీద స్పందిస్తూ...ఎలాంటి ఆందోళన చేయాలో కూడా పవన్ కల్యాణే చెప్పాలన్నారు. తాను ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు కూడా సిద్ధమే అని జేసీ అన్నారు.
రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు అన్న పవన్ ప్రశ్నకు స్పందిస్తూ...33 కాదు 53 వేల ఎకరాలు అయినా కావాలని వ్యంగ్యంగా స్పందించారు.
విశ్లేషనలోకి వెళ్తే....
ఎంపీ లుగా నిలబడి ఎన్నిలల్లో గెలిచి ప్రజల తరపున ఏ విధంగా పార్లమెంటులో పోరాడాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారంటే.. గెలిపించిన ప్రజలే దానికి సమాధానం వెతుక్కోవాలని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తుంది.
రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం గురించి పార్లమెంటులో పోరాడలేనప్పుడు ఆ పదవుల్లో ఉండి మీడియా ముందు కుదిరినప్పుడల్లా ఉపన్యాసాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది విశ్లేషకులకు కలిగే ప్రశ్న.
ఇద్దరు ఎంపీలతో తెలంగాణా పై తెరాస పార్లమెంటు లో పోరాడలేదా...ప్రజల తరపున పోరాడాలని సంకల్పం లేనప్పుడే పలు సాకులను చెప్పుకోవచ్చు అనేది ఏపీ ఎంపీలను చూసి నేర్చుకోవచ్చు.