జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత పర్యటన ఈ నెల 5వ తేదీన ఖరారైంది.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తానని, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటానని పవన్‌ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాగా ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం కేటాయించిన బడ్జెట్ మీద కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కు బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత రైతు సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతన్నకు న్యాయం జరిగేలా పోరాడాలని పవన్ భావించినట్లు తెలుస్తుంది.
దీనితో పాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయం తో పాటు... ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రం నేరవేర్చేల ఒత్తిడి తేవడం కోసం పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది.