చిత్తూరు జిల్లాలో మహిళపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో జరిగింది.
ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...మహిళలపై అత్యాచారాలు జరిపే వారిని కఠినంగా శిక్షిస్తామని... కఠిన శిక్షలు అమలు చేయడమే కాకుండా...మరొకరు ఆ పని చేసేందుకు భయపడేలా చూస్తామని తెలిపారు.
ఈ దారుణానికి పాల్పడిన దోషుల్ని వెంటనే పట్టుకొని శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు చంద్రబాబు తెలిపారు.
మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీ లో తెలిపారు.
ఈ కేసును నిర్భయ చట్టం కింద నమోదు చేయనున్నట్లు చెప్పారు.