మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో రజక శంఖరావం మహా సభ నిర్వహించిన సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతిని ప్రేమించే వారే ఆ జాతికోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనకాడబోరని... తెలంగాణ కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ప్రాణాలర్పించిన ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని....శ్రమ జీవులు భూమికి దూర మయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం రావాలని... అందుకోసం ప్రజలు, అణగారిన కులాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.