తెలుగు చిత్రసీమతో హైదరాబాద్‌ రేంజ్‌ ఆదాయపు పన్ను శాఖ గురువారం హైదరాబాద్‌లోని నిర్మాతల మండలి హాలులో ఏర్పాటుచేసిన అవగాహనా సదస్సులో పలువురు సినిమా ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో పాల్గొన్న దర్శకరత్న దాసరి మాట్లాడుతూ.... మాది ప్రచారం చుట్టూ నడిచే పరిశ్రమ...ప్రజల్లో సినిమాకి ఉన్న ప్రచారం ఎక్కువ అని అన్నారు.
సినిమా వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారనే భావన బాగా పడిపోయిందని...ఆ భావనతో ఆదాయపన్ను విభాగం చిత్ర పరిశ్రమ మీదే ఎక్కువగా కన్నేస్తుందని అన్నారు.
సినిమా అనేది వాస్తవంగా అసలు పరిశ్రమే కాదనీ... దీన్ని ప్రభుత్వం పరిశ్రమ అని ప్రకటించిందే కానీ పరిశ్రమకు కావాల్సిన స్థాయిని, సౌకర్యాలను దీనికి కల్పించలేదనీ ఆయన అన్నారు.