తల్లిదండ్రులను మరువవద్దు.

 


తల్లిదండ్రులను మరువవద్దు.

"మాతా గురుతరా భూమేః ఖాత్ పితోచ్చతరస్తథా" అంటే 'తల్లి (యొక్క గౌరవం) భూమికంటే మహత్తరమైనది, మరియు తండ్రి (పిత) ఆకాశం కంటే గొప్పవాడు (మహాభారతం, వన పర్వం 313.60) .


ఎవరిని మరిచినా, నీ తల్లిదండ్రులను మరువవద్దు. వాళ్ళను మించి నీ మంచి లేక మేలు కోరేవారెవరూ ఉండరని తెలుసుకో. నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారు. నువ్వు రాయివై వారి హృదయాలను వ్రక్కలు చేయవద్దు. కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు. అమృతమిచ్సిన  వారిపైననే విషాన్ని విరజిమ్మవద్దు. ముద్దుమురిపాలతో నీ కోర్కెలను తీర్చారు. ఆ ప్రేమమూర్తుల కోరికలను నీవు నెరవేర్చాలని మరువవద్దు. నువ్వెన్ని కోట్ల ధనం సంపాదించిన అవి తల్లిదండ్రులకు సమానము కావు. వారి ప్రేమను పొందని నీ జీవితం వ్యర్థమే. సేవా భావం అలవరుచుకో. గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖమును కోరుతావు. నీసంతాన ధర్మం మరువవద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయ సూత్రం మరువవద్దు. నీవు తడిపిన పక్కలో వారు పడుకొని, నిన్ను పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు. వారి ముసలి తనంలో అది జ్ఞాపకముంచుకొని, తగిన సేవ చెయ్యి. అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపవద్దు. నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు, నీవు ముల్లువై వారిని బాధించవద్దు. జీవితంలో ఏదిపోయినా మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని మార్గదర్శకులైన తల్లిదండ్రులను మాత్రం మళ్లీ సంపదీచుకోలేవు. వారి నిర్మలమైన ప్రేమను మరియు గొప్పదనమును గుర్తుంచుకొని, వారి పాదాలకు ప్రతిరోజు మ్రొక్కి జీవితం సార్థకం చేసుకో.
__,_._,___

No comments: