ప్రజా సమస్యలపై చిత్త శుద్దితో పోరాడే పత్రికలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి అంటే?. ఈ ప్రశ్నకు సమాధానం మనదగ్గర ఉందా అంటే...సమాధానం చెప్పడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఎందుకంటే వివిధ చానళ్ళను, పత్రికలకు ఫాలో అయ్యే ప్రజలకు దీనికి సమాధానం ఎప్పుడో దొరికే ఉంటుంది. దాదాపు ప్రతీ చానల్, ప్రతీ పత్రికా ఏదో ఒక రాజకీయ పార్టీ కి కొమ్ము కాస్తన్నాయనే వాదనే బలంగానే ఉంది..పలు మార్లు అది ఏదో రూపంలో రుజువవుతానే ఉంది.
అయితే ఇప్పుడు ఆ వొరవడి మరీ బరి తెగిస్తుందన్న అనుమానం తదితర పత్రికలు ప్రసారం చేసే వార్తలను బట్టి అర్ధమవుతుందని చెప్పడంలో ఎంతో కొంత వాస్తవం దాగి ఉంది.
ఈ అనుమానాలకు బలం చేకూర్చే సంఘటనల్లో ఒకటిగా గత రెండు రోజులుగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న మూకమ్మడి దాడి అని చెప్పుకోవచ్చు.
సినిమాలు చేసుకుంటూ టాప్ యాక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి తనకు సమాజం మీద ఉన్న భాద్యతను తన వంతుగా చాటుకోవడానికి ముందుకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ 'జన సేన' ని స్థాపించుకొని తన గొంతుని ప్రజల పక్షాన వినిపించే ప్రయత్నం చేస్తుంటే....ఇది యెల్లో జర్నలిజానికి రుచించడం లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి స్పష్టత లేదని...పవన్ కళ్యాణ్ ఇప్పుడు బయటకు రావడం ఏమిటని...ఇలా ఇష్టమొచ్చినట్లు వార్తలను వండి ప్రజలపై రుద్దే ప్రయత్నాన్ని జోరుగా చేస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలో అన్నదాత భూములను సేకరిస్తున్నప్పుడు...రైతుల ఆందోలనలని ఎన్ని పత్రికలు కవర్ చేశాయి...వాళ్ళ సమస్యలను ఎన్ని పత్రికలు నిస్పక్ష పాతంగా ప్రచారం చేసాయి? ... రైతుల ఏడుపుని పట్టించుకున్న నాధుడు ఎవరు?... ఇలా ప్రశ్నలు మనముందు కదిలాడుతూనే ఉంటాయి.
మన భూమి ఒక అడుగు పొతే నే ఎంతో భాద పడతామే...అలాంటిది ఎకరాలు ఎకరాలు భూమిని రైతులు ప్రభుత్వానికి ఇష్టంగా ఇచ్చారంటే దానిలో నిజమెంత ఉంది. దీనిలో దాగిఉన్న రైతుల భాద, ఆవేదన ఎంత ఉందో రైతుల తరపున ఆలోచిస్తే మనకు అర్ధమవుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే...రైతులకు సరి అయిన నమ్మకం, వ్రాత పూర్వకమయిన గారంటీ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా...ఇస్తే అది రైతులకు సంతృప్తి కరంగా ఉందా? ...ఇలా మరెన్నో ప్రశ్నలు.
వీటి మీద ప్రసారం చేయడానికి చేతకాని మీడియా....తన వంతుగా రైతుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తే...దీనిలో అర్ధం కాగాపోవడానికి ఏముంది.
రైతులకు అనుమానాలు ఉన్న సంగతి నిజం కాదా?...ఇష్టం లేకుండా రాజకీయ నాయకులకి భయపడి భూములు ఇచ్చిన రైతులు లేరా?..రైతులకు వ్రాత పూర్వకంగా సరైన నమ్మకాన్ని కలిగించలేదు అన్న మాటలో వాస్తవం లేదా?..
మరి వాస్తవాలను తెలుసుకొని బయటపెడితే దానిలో అర్ధం కాకపోవడానికి ఏముంది. అది ఎల్లో జర్నలిజానికి అర్ధం కాకపోవచ్చు...ఎందుకంటే వాళ్ళకు సమాజంలో ఉన్న సమస్యల కన్నా... వాళ్ళను డైరెక్షన్ చేసే నాయకుల మీదే మక్కువ ఎక్కువ కాబట్టి.
ఈ మాటలు వాడటం ఒక పౌరిడిగా భాధే...కానీ తెలుగు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి...ఆ విజ్ఞత మన ప్రజలు చాలా ఉందనేది నా నమ్మకం.
అయితే ఇప్పుడు తొలస్తున్న ప్రశ్న ఏమిటంటే...ఈ మీడియా ని ఉసిగొల్పుతుంది ఎవరు అనేది? ...పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో గద్దె నెక్కిన పార్టీ యే దీనికి కారణమా అనేది భలంగా సంచరిస్తున్న ప్రశ్న.
రైతుల పక్షాన పోరాడే వారు ఎవరినైనా సరే వారిని అభినందిచడంలో తప్పులేదనేది నా భావన.
ఎవరి పోరాటంలో ఎంత విశ్వసనీయత ఉందో తెలుసుకునే విజ్ఞత మన తెలుగు ప్రజల్లో ఉందనే నేను భావిస్తున్నా.