మంగళవారం అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ పై ప్రసంశల వర్షం కురిపించారు.
భారతదేశం ప్రతిష్ఠను అంతర్జాతీయంగా చాటిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ యే అని చంద్రబాబు ప్రశంసించారు. బీజేపీతో ఎన్నికల కంటే ముందే పొత్తుపెట్టుకున్నామని....ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.
దేశ ప్రయోజనాలు, తెలుగు ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన అన్నారు.
పరోక్షంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ... కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి పదవికి తాను ఎప్పుడు రాజీనామా చేస్తానా.... ఆస్థానంలో ఎప్పుడు దూరాలా అని కాచుకుని ఉన్నారని ఎద్దేవా చేశారు.
మరి...
బడ్జెట్ లో రాష్ట్రానికి కేంద్రం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని...అదే విధంగా పోలవరం ప్రాజెక్టు కు కేవలం రూ.100 కోట్ల నిధులను విడుదల చేయడం...దానితో పాటుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యెక ప్యాకేజీల్లాంటి ఊసు ఎత్తకపోవడం పట్ల... గత కొద్ది రోజులుగా చంద్రబాబు కేంద్రం మీద తన అసంతృప్తిని భాహిరంగాగానే వెలుబుచ్చుతున్న నేపధ్యంలో....హఠాత్తుగా ప్రధాని మోదీ మీద ఈ ప్రసంశల వర్షం ఏంటి అనేది ప్రజలకు కలుగుతున్న మరో కొత్త కన్ఫ్యూజన్.
తిరుగులేని మెజారిటీతో గద్దెనెక్కిన నరేంద్ర మోదీ దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా చాటిన ప్రధానే కావచ్చు..కానీ ఆంధ్రా ప్రజలకు ఎన్నికల సమయంలో తనే స్వయంగా ఇచ్చిన హామీలను ఇంతవరకూ నేరవేర్చకపోగా...ఎలాంటి నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయకుండా ఇప్పటికే దగాకు గురి అయిన ఆంధ్రా ప్రజల ప్రతిష్టను మరింత దిగ జారుస్తున్నారనేదే ప్రజల ఆవేదన.
మరి దీనిమీద స్పష్టమైన స్పందన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందా...ఏమో చూద్దాం.