వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ రాజధాని భూముల మీద మాట్లాడుతూ... మంగళగిరిలో ఉన్న రెండు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు రాజధాని నిర్మాణానికి సరిపోతాయని, మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కోవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.
రాజధాని పేరిట రైతుల పంట పొలాలతో చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని...ఇది చాలా దారుణమని... బుద్ధున్న వారెవరూ ఇలా చేయరని మండిపడ్డారు.