ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు విస్తరణలో భాగంగా మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణ పనులకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....విద్యుత్ కోతలు లేని తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమని.... ప్రస్తుతం నెలకొన్నసంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అనివార్యమని అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ కల్లా నిర్మాణ దశలో ఉన్న 1200 మెగావాట్ల ప్లాంటు పనులను పూర్తిచేయాలని.... కాంట్రాక్టు పనులు చేపట్టిన సంస్థలు గురుతర బాధ్యతగా భావించి అనుకున్న సమయంలో పూర్తి చేయాలని కెసిఆర్ సూచించారు.