ప్రతిపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి అసెంబ్లీలో బ్రహ్మాండమైన డ్రామా ఆడుతున్నాయని మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో విమర్శించారు.
బీజేపీ, టీడీపీ నాయకులు బయటేమో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని... సభలో మాత్రం పరస్పరం ఒకరి మీద ఒకరు పొగడ్తలు కురిపించుకుంటూ భలే డ్రామా ఆడుతున్నారని జగన్ విమర్శించారు.
ఈ రెండు పార్టీలు సభలో తనను విమర్శిస్తున్నాయని... తమ చేతుల్లో ఏమీ లేకున్నా మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి ఏపీ కి సాయం చేయాలని కేంద్రాన్ని కోరామని ఆయన అన్నారు.