తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు.
ఇక మల్లు భట్టివిక్రమార్కను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లా మధిర నుంచి భట్టివిక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా భట్టీవిక్రమార్క పనిచేశారు.
తెలంగాణా రాష్ట్రం తో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలకు కూడా కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.