శివపార్వతుల వాసం కైలాసం

 


శివపార్వతుల వాసం కైలాసం

భూతల స్వర్గమైన హిమాలయ పర్వత శ్రేణులలోని కైలాస పర్వతం పార్వతీ-పరమేశ్వరుల నిలయంగా మన పురాణాలు ఘోషిస్తున్నాయి.

కైలాసానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే:

కైలయోర్జల భూమ్యోః ఆసనం స్థితిః యస్య కేలాసః స్ఫటికం, యమ్ కైలాసః-

జలంలోను, భూమిలోను స్థితమైన దాన్ని 'కేలాస్' అంటారు. కేలాస (స్ఫటిక) రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని 'కైలాసం' అంటారు. వరాహ పురాణాని గ్రంథాలు కైలాసపర్వత మహాత్మ్యాన్ని వర్ణించాయి.

సనాతన సాహిత్యంలో కైలాస పర్వత వర్ణన కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలోని కిష్కింధ కాండలో సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు శతబల వానరసేనను ఉత్తర దిశగా పంపిస్తూ కైలాస పర్వతాన్ని కూడా పేర్కొన్నాను.

మహాభారతంలోని అరణ్య, ద్రోణ, అనుశాసన పర్వాలలో కైలాసపర్వత ప్రస్తావన ఉంది. అరణ్యపర్వంలో పాండవుల గంధమాదన యాత్ర సందర్భంలో కైలాస ప్రసక్తి వస్తుంది. మహాకవి కాళిదాసు ప్రసిద్ధ రచన 'మేఘదూతం'లో కూడా కైలాసగిరిని ప్రస్తావించారు.

మహాభారతంలోని భీష్మపర్వంలో కైలాస పర్వతాన్ని 'హేమకూటం' అనీ, కొన్ని పురాణాల్లో 'గణపర్వతం' అనీ, 'రత్నాద్రి' అనీ పేర్కొన్నారు.


కృతయుగంలో మాంధాత; త్రేతాయుగంలో రావణ, భస్మాసురులు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు కైల్సాసంలో తపస్సు చేశారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, వ్యాసమహర్షి కైలాసపర్వతాన్ని దర్శించారు.

__,_._,___

No comments: