నూతన రాజధాని కోసం రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూమి మీద పలు వివాదాలు, అనుమానాలు చోటు చేసుకున్ననేపధ్యంలో... రైతుల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కోసం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. 
అయితే పవన్ పర్యటనకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు తమ సపోర్ట్ ను తెలుపుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు రాజధాని నిర్మాణం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధించారు.
జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో పర్యటన చేస్తూ రైతుల భాధలను తెలుసుకొని...బలవంత భూసేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడాన్ని సమర్దిస్తున్నాని వీ హెచ్ అన్నారు.
ఎలెక్షన్లో గెలవడానికి పవన్ కళ్యాణ్ ను ఉపయోగించుకొన్న టీడీపీ.. ఇప్పుడు పవన్ కి రాజకీయ అనుభవం లేదని...పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదని అంటుందని వీహెచ్ అన్నారు.
ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు కూడా రైతుల తరపున ఉద్యమంలో పాల్గొనాలని వీ హెచ్ పిలిపునిచ్చారు.