ఆదివారం టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ....రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్‌ ను పటిష్ఠ పరచడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ పాత్ర ఏమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తన మంత్రివర్గంలో దళితులు, మహిళలకు స్థానం కల్పించలేదని...తెలంగాణ తొలి కేబినెట్‌లో ఒకే కుటుంబం, ఒకే కులం ఉందని ఆయన ఉన్నారు.
హామీలను కెసిఆర్ గాలికొదిలేశారని...అడ్డదిడ్డమైన పాలనను సాగిస్తున్నారని... అమరుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు.