బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఏ రోజు ఏం కూలగొడతారో తెలియని అయోమయ స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని సోమవారం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సమస్యలను పరిష్కరించ డానికి ప్రయత్నించకుండా సచివాలయాన్ని కూలగొట్టి ఎర్రగడ్డకు తీసుకపోతానంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ఎస్టీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని....ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులను దారి మళ్లిస్తే డానికి బాధ్యులైన ప్రజా ప్రతినిధులు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కిషన్ రెడ్డి అన్నారు.