రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన హామీల గురించి రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చకపోవడాన్ని తీర్వంగా తప్పుపడుతూ కేంద్రాన్ని నిలదేశారు.
విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.50 లక్షలు... పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు.... ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బిచ్చగాళ్లనుకుంటున్నారా? అని కేవీపీ రామచంద్రరావు కేంద్ర ప్రభుతాన్ని నిలదీశారు.
విభజన చట్టంలో రాజ్యాంగస్ఫూర్తి కొరవడిందని....ఆనాడు విభజన సందర్భంలోపార్టీలకతీతంగా ఆంధ్రప్రాంత ఎంపీలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించినా న్యాయం జరగలేదని... విభజన చట్టంలోని లోపాలను పట్టించుకోకుండా బీజేపీ కూడా విభజనను సమర్థించిందని... ఇప్పుడేమో రాష్ట్రానికి న్యాయం చేసేందుకు మాత్రం వెనకాడుతోందని కేవీపీ విమర్శించారు.