వివాదాస్పద ట్వీట్ లతో హోరెత్తించే క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరి కొన్నకొత్త ట్వీట్ లతో మన ముందుకు వచ్చాడు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన కొన్ని ట్వీట్ లు చేశారు. మహిళలకు పురుషుడిలాగే జీవించే స్వేచ్ఛ కావాలని...ఓ మహిళ గురించి మరో మహిళ చేసే ప్రకటన ఎప్పటికీ చాలా అందంగా, గొప్పగా ఉంటుందని... ఆ విషయాన్ని రాజకీయ నాయకులు, నీతులను గురించి మాట్లాడే పెద్దలు ఓ సారి ఆలోచించాలని తన ట్వీట్ ద్వారా చెప్పారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రం జ్యోతిలక్ష్మీ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ బహుమతిలాంటిదని వర్మ తెలిపారు.
ఒక చిత్రం ఎన్నో భావాలను వ్యక్తపరచగలదు....ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీకి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ లైంగిక దాడులు చేసేవాళ్లకన్నా భయంకరమైనవాడని వర్మ ట్వీట్ లో తెలిపాడు.