Omkaram Yoga Kshemam |
శనివారం నాటి యోగక్షేమం. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం మధ్య ఏ సమయంలో అయినా హనుమంతుని దేవాలయానికి వెళ్ళి తమలపాకులు దండగా చేసి స్వామికి సమర్పించి, (5 ఐనా చాలు ఒక దండగా చేసి ఇవ్వండి) కొబ్బరికాయను అక్కడ ఉండే పండితునికి దానంగా ఇవ్వాలి. తమలపాకులు దొరకనివారు దేవాలయంలో హనుమాన్ చాలీసా చదివి, కొబ్బరికాయను అక్కడ ఉండే పండితునికి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే దీర్ఘకాల ఋణాలు తొలగిపోతాయి. |
ఆదివారం రోజు యోగక్షేమం భార్య, భర్తలు ఇద్దరు ఒకరిపై, ఒకరికి ఉన్న కోపాలు పోయి,అన్నోన్యంగా ఉండటానికి ఆదివారం నాడు ఏ సమయంలో అయినా భార్య, భర్తలు ఇద్దరూ కలసిశ్రీ రాముని దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక మట్టి ప్రమిదలో గానుగు నూనేతో" దీపం వెలిగించి సంకల్పం చేసి అక్కడే "శ్రీ రామ అష్టోత్తరంను" ఏ ఒక్కరు చదివినా పరవాలేదు. ఇద్దరూ చదివితే చాలా మంచిది. లేదా ఒకరు చదివి మరొకరు వినినా పరవాలేదు. ఇలా చేస్తే భార్య, భర్తలు ఇద్దరూ జీవితాంతం అన్నోన్యంగా ఉంటారు.
|
No comments:
Post a Comment