Small Spiritual Snippet

 


సభ్యత-సంస్కారం

ఒకసారి ఫ్రాన్స్ రాజు నాలుగో హెన్రీ తన అంగరక్షకుడితో కలిసి ప్యారిస్ లో సాధారణ జనం తిరుగాడే మార్గంలో నడుస్తున్నాడు. ఒక బిక్షగాడు తన తలపై ఉన్న టోపీని తీసి రాజుకు నమస్కరించాడు. జవాబుగా హెన్రీ కూడా తల వంచి ప్రత్యుత్తరమిచ్చాడు. ఇది చూసి అంగరక్షకుడు, హెన్రితో "మహారాజా! మీరి సామ్రాట్టు, అతడు కేవలం బిక్షగాడు. అతడికి మీరు నమస్కరించడం ఏమీ బాగాలేదు" అన్నాడు.

అందుకు హెన్రీ "నేను ఒకవేళ తిరిగి అతడికి అభివాదం చేసి ఉండకపోతే నువ్వు ఫ్రాన్స్ కి సామ్రాట్టువి, నీలో కనీసం ఆ బిక్షగాడికున్న సభ్యత, సంస్కారం కూడా లేవని నాలోని మానవత్వం నన్ను దూషిస్తుంది' అని బదులిచ్చాడు."

__,_._,___

No comments: