Small Spiritual Snippet

 


వికాస మంత్రాలు - స్వామి పార్థసఖానంద.

(1) సహన శక్తి
- సహనం అన్ని సార్లు ఉపయోగపడక పోవచ్చు, కాని అసహనం ఎన్నడు ఉపయోగపడదు. తొందరపాటుకు ఫలితం పశ్చాత్తాపం.
- అజేయులయిన ఇద్దరు యోధులు - సహనం, సమయం.
- ఎంతసేపు వేచి ఉందగలమని కాదు, వేచి ఉండే సమయంలో మనం ఎంత బాగా ప్రవర్తిస్తామో సూచించేదే సహనం.
- సహనం, అసహనం అనేవి పరస్పర వ్యతిరేకమైనవి. సహనం మనల్ని మానసికంగా బలవంతులుగా చేస్తుంది. అసహనం మనకు మతిస్తిమితం లేకుండా చేస్తుంది.


(2) సత్సాంగత్యం
- సజ్జనులతో చేసే ఏ పయనము సుదూరం కాదు.
- సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం - ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢతరం చేసేవి.
- సజ్జన సాంగత్యం, పరిమళ ద్రవ్యాల దుకాణాన్ని సందర్శించడంలాంటిది. మనం వాటికి కొన్నా, కొనకపోయినా, మనకు సువాసన అంటుకునే తీరుతుంది.
- మనిషి జీవితానికి ఆలంబనగా నిలిచే ముగ్గురు స్నేహితులు:
సంపద - అదృష్టం ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది.
బందువులు - శ్మశానం వరకు మాత్రమే తోడుగా ఉంటారు.
పుణ్యం - శ్మశానం దాటిన తరువాత కూడా మనల్ని అనుసరిస్తుంది.
- మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరితనంతో బాధ పడుతున్నామంటే, మనం దుర్జనుల సహవాసంలో ఉన్నట్లు.

(3) సృష్టికర్త ఒక్కడే!
మనం వేర్వేరు మతాలకు చెందినవారమై ఉండవచ్చు, కానీ అందరం ఒకే లోకంలోనే ఉన్నాం కదా! ఈ లోకానికి సృష్టికర్త ఒక్కడే కదా! అంటే అన్ని మతాల వారు తెలిసో, తెలియకో ఒకే సృష్టికర్తను పూజిస్తున్నారన్న మాట! ఇది అర్థం అయితే, ఇక గొడవలే ఉండవు!!

__._,_.__
__,_._,___

No comments: