Small Spiritual Snippet

 


నేను జీవించి ఉండటం దేనికి?
భగవంతుని సన్నిధిలో తమ బాధలు చెప్పుకుంటే నివృత్తి అవుతాయని ప్రజలలో ఒక నమ్మకం ఉన్నది. అయితే ప్రజలందరికీ ఈ భగవత్సాన్నిధ్యం లభించడంలేదు.
నాలో అట్టి సాన్నిధ్యం ఉందని నమ్మి అమాయకంగా వచ్చి, భగవంతుడికి నివేదించుకున్నట్లే నాతో తమ కష్టసుఖాలు చెప్పుకుని తృప్తితో వెళుతున్నారు. వారి నమ్మకాన్ని నేను ఎందుకు కాదనాలి?

ఈ మాత్రమైన వారిలో భగవచ్చింతన ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను.
తమ కష్టాలు చెప్పుకుంటే వినడానికి కాకపోతే అసలు నేను ఎందుకు జీవించి ఉండాలి? అందువల్ల నా శరీరానికి శ్రమ కలిగినా, నా బలం క్షయమైన నాకే కొదవా లేదు.
-- పరమాచార్య --
__,_._,___

No comments: