గురువారం ముక్కోటి ఏకాదశి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో రద్దీ గా మారాయి.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా....తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరం కలిసి రావడంతో బుధవారం రాత్రి నుంచే వేచి ఉన్న ప్రముఖులు గురువారం 2015 జనవరి 1న ఒంటి గంట నుంచి 3 గంటల వరకు వీఐపీ దర్శనానిక అనుమతివ్వడంతో వీఐపీలందరూ ఒక్కసారిగా స్వామి దర్శనానికి పోటెత్తారు.
తిరుమల వెంకన్నను దర్శించుకున్న వారిలో...కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు రాయపాటి, మేకపాటి, గరికపాటి, సీఎం రమేష్, తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డితో, నటుడు బ్రహ్మానందం తదితర ప్రముఖులు ఉన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా... భద్రాద్రి రాముడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణ మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.