teluguvaahini.com - Kolavari Di music director compose tunes for Charan – Srinu Vaitla movie.

teluguvaahini.com - Kolavari Di music director compose tunes for Charan – Srinu Vaitla movie.

Link to TeluguVaahini

Kolavari Di music director compose tunes for Charan – Srinu Vaitla movie.

Posted: 07 Feb 2015 08:02 PM PST

Mega Power star Ramcharan Teja next movie confirmed with director Srinu Vaitla. After Govindudu Andari Vadele, charan waits for a long time and srinu vaitla too. They combined for the next movie. Sensational Music director...

www.telugubhakti.com Quotable Quote

 

హరిహరభేదం

తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్యుల అంశలు నాలుగూ ఇమిడి ఉన్నాయి. 'బాలాజీ' అనే పేరు 'బాలసుబ్రహ్మణ్యము"నకు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగాభరణాలు, బిల్వ పత్ర పూజ శివ స్వరూపానికి సాక్షాలు. శంఖ చక్ర కిరీటాలు శ్రీ మహావిష్ణువు చిహ్నాలు. వెలుపలి ప్రాకారంలో సింహ శిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది. ఈ విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి శివ, కేశవ, శక్తి, బాలసుబ్రహ్మణ్యముల సమన్వయమూర్తి. ఆ విధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ, కేశవాది బేధాలు ఆదిలో లేవు. 

-- పరమాచార్య --


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (149)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

www.telugubhakti.com శ్రీ గురుభ్యోనమ

 

శ్రీ గురుభ్యో నమ: - ౧

 

       ఒక ఇంటిలో "పూజా గృహం" ఎలాంటిదో, ఈ భువనానికి మన భారతావని అటువంటి పవిత్ర స్థలం. ఇక్కడ అనాదిగా ఆధ్యాత్మికత ఋషుల నుంచీ నేటికీ నిరంతరంగా ప్రవహిస్తూ ఉంది. ఎందరో పుణ్యపురుషులు ఈ భారతావనిలో జన్మించి తమ తపశ్శక్తితో, మేధా సంపత్తితో విదేశీయులను సైతం ఆకర్షించి వారి జ్ఞానతృష్ణను తీర్చిదిద్దారు. 

     గత 2000 ఏళ్లుగా భారతావనిలో 1. గౌతమబుద్ధుడు, 2. మహావీరుడు, 3. ఆదిశంకరులు, 4. గురునానక్, 5. రామకృష్ణ పరమహంస, 6. పండిట్ రవిశంకర్, 7. రామ్ దేవ్, 8. మాతా అమృతానందమయ, 9. మహేష్ యోగి, 10. సత్యసాయి బాబా వరకూ ఎందరో యోగ పుంగవులు భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసి, భారత గురుపీఠాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. పేర్లు తెలిసిన వారికంటే వ్యక్తం కాకుండా తెర వెనుకనే అజ్ఞాతంగా పని చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఆ పుణ్యమూర్తులను స్మరించుకుంటూ కొందరిగురించి తెలుసుకుందాం. 

 

గౌతమ బుద్ధుడు(క్రీ. పూ. 5వ శతాబ్దము):- 

గౌతమ బుద్ధుడు ఒక రాజకుమారుడు. ఇతని పూర్వనామం సిద్ధార్థుడు అంటే ఆశలు సిద్ధించిన వాడు అని అర్థం. గౌతమ బుద్ధుడు బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా అంతఃపురంలో రాజభోగాలలో పెరిగాడు. అయితే ఒకరోజు అనుకోకుండా నడవటానికి కూడా శక్తిలేని ఒక వృద్ధుణ్ణి, ఓ రోగినీ చూడటంతో అతనికి లోకంలో ఆర్తులు ఉన్నారని తెలిసింది. ప్రపంచంలోని ఈ బాధలకు కారణం తెలుసుకోటానికి తన రాజప్రసాదం వదిలిపెట్టాడు సిద్ధార్థుడు. తరువాత సకల కష్టాలకూ ఆశలే కారణమని, మోక్షసాధనలో ఈ ఆశలకు లొంగని ప్రయాణమే విజయం సాధిస్తుందనీ కనుగొన్నాడు. ఈ ఆలోచనే బుద్ధభగవానుని బోధనలలో ప్రముఖంగా ప్రసిద్ధి గాంచింది. కోరికల నుంచి విడుదలైన మనిషి  మరుజన్మలేని నిర్వాణం(ముక్తి) లభిస్తుందని బుద్ధుడు ప్రవచించాడు. బోధివృక్షం నీడలో జ్ఞానోదయం కలగటం వలననే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయినాడు. ఎందరో ప్రజలు కుల, మత, వర్గ రహితంగా ఇతని అనుచరులుగా మారిపోయారు. ఆ తరువాత ఏ బేధంలేని జీవన విధానం అనుసరించే సన్యాస ఆశ్రమ విధానం అయిన "సంఘాన్ని" బుద్ధుడు స్థాపించాడు. 

 

మనిషి వాంఛించే నిర్వాణం పొందగలిగిన 8 సూత్రాలను లేదా మధ్యేమార్గాల్ని బుద్ధుడు మనకు ప్రసాదించాడు. 

1. సరిగా అర్థం చేసుకోవటం. 

2. సరైన ఆలోచనా విధానం. 

3. సరైన పలుకులు. 

4. సరైన పని. 

5. సరైన జీవన విధానం. 

6. సరైన కృషి. 

7. సరైన మానసిక స్థితి. 

8. సరైన ఏకాగ్రత. 

      గౌతమ బుద్ధుని "లైట్ ఆఫ్ ఆసియ" అని కూడా పిలుస్తారు. ఇతని బోధనలు ఆసియా ఖండం దాటి మొత్తం ప్రపంచమంతా కూడా విస్తరించాయి. గౌతమ బుద్ధుడు మన భారతదేశానికి గొప్ప గర్వకారణం. 

 

మహావీరుడు(క్రీ. పూ. 599-527):- 

      ఇతను జైనమత స్థాపకుడు. 30సంవత్సరాల వయస్సులో సత్యాన్వేషణలో కుటుంబాన్ని పరిత్యజించి, పరివ్రాజకునిగా మారాడు. జ్ఞానసిద్ధి పొంది "జైనుడు"గా మారి తాను తెలుసుకున్న సత్యాన్ని సర్వమానవులకు వివరిస్తూ సంచారం చేశాడు. అహింస, సత్యం, అసత్యత్యాగం, అపరిగ్రహ, బ్రహ్మచర్యమనే "పంచ" సిద్ధాంతాలను బోధించాడు. ముక్తిమార్గంలో మానవులంతా సమానులే అని కుల, మత, వర్గ, భాషా భేదాలను నిరశించాడు.  

 

ఆదిశంకరులు(క్రీ. పూ. 1వ శతాబ్దం):- 

    ఆధునిక విజ్ఞానం నేడు ఈ జగత్తును అద్వితీయమైన చైతన్య శక్తిగా గుర్తిస్తూ ఉంది. కానీ 2000 సంవత్సరాల క్రితమే ఈ "అద్వైత" భావనని ప్రపంచానికి అందించిన వాడు ఆదిశంకరులు. శివగురు, ఆర్యాంబ ఎంతో ఘోర తపస్సు చేసి ఉంటారు. అందుకే ఆ పుణ్య దంపతులకు తెలివైన "శంకరుడు" జన్మించాడు. వీరి స్వస్థలం కేరళలోని "కాలడి" గ్రామం. ఈ కుర్రవాడు, తన 6సంవత్సరాల వయస్సులోనే తొలి పుస్తకం రచించాడు. అంత చిన్న వయస్సులోనే అతనితో రాజులు, గొప్ప వ్యక్తులు సంప్రదించేవారు. 8సంవత్సరాల వయస్సులోనే శంకరుడు సన్యాసం స్వీకరించడానికి తన తల్లిని అనుమతి అడిగాడు. ఎంతో కష్టంతో ఆ అనుమతి సాధించాడు. ఆ తరువాత ఎక్కడ ఉండాలో, ఏమి తినాలో కూడా తెలీకుండానే కేవలం కాలినడకన కేరళ నుంచీ మధ్యప్రదేశ్ వరకూ ప్రయాణించాడు. తన గురువైన "గోవిందపాద"ను నర్మదా తీరంలో కలుసుకున్నాడు. విద్యాభ్యాసం ముగించుకుని గురువుగారి ఆశీస్సులతో శంకరుడు ఉపనిషత్ వివరణలు రచించడం ప్రారంభించాడు.

అతను రచించిన భగవద్గీత వివరణ, ఉపనిషత్ లు, బ్రహ్మ సూత్రాల వివరణలు పండితులచే కూడా కొనియాడబడ్డాయి. చివరకు తన స్వంత రచనలు చేయటం ప్రారంభించిన శంకరుడు "భజగోవిందం", "ఆత్మబోధన", "తత్వబోధ", "దక్షిణామూర్తి స్తోత్రాలు", "వివేక చూడామణి" మొదలైనవి రచించాడు. ఇవన్నీ కూడా మోక్షాన్వేషణ చేసే మానవులకు ఆ దాహార్తిని తొలగించే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు. ఆదిశంకరులు దేశం నాలుగు దిక్కులలో నాలుగు శంకర మఠాలు స్థాపించి,(పూరి, శృంగేరి, బదరీనాథ్, ద్వారక) హైందవ మతాన్ని పునరుద్ధరించారు. ఎందరో రాజులు, మేధావులు, విజ్ఞానులు, వ్యాపారులు ఇతని అనుచరులుగా మారిపోయారు. 32సంవత్సరాల వయస్సుకే "హైందవధర్మ" పరిరక్షణ పూర్తిచేసి, 72 వివిధ రంగాలలో తన ఆలోచనా విధానాలను నెలకొల్పాడు. "అద్వైత సిద్ధాంతాన్ని" ప్రబోధించాడు. అంత చిన్న వయస్సులోనే పరమాత్మను చేరుకున్నాడు. శంకరుడు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ.

 

తిరువళ్ళువర్:- 

     తమిళులకు ఆరాధ్య గ్రంథం "తిరుక్కురల్" రచించాడు. దీనిని "ముపృల్" అని కూడా పిలుస్తారు. అంటే "త్రివర్గం" అని అర్థం. ఈ గ్రంథం "ధర్మ, అర్ధ, కామ"మనే మూడు గుణాల గురించి వివరిస్తుంది కనుక ఆ పుస్తకానికి ఈ పేరు వచ్చింది. తిరువళ్ళువర్ జీవితకాలం గురించిన సరైన వివరాలు లభించటం లేదు. ఇతను కన్యాకుమారికి రాజుగా ఉండి, బుద్ధునిలా అన్నీ త్యజించాడనీ కొందరు, చేనేత కుటుంబంలో జన్మించిన వాడనీ కొందరు నమ్ముతారు. "కురల్" అంటే చిన్న శ్లోకం వంటిది. "తిరుక్కురల్"లో ఇలా 10 శ్లోకాలు వంటివి ఒక భాగంగా, మొత్తం 133 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో జీవితం, ప్రేమ, అదృష్టం, కుటుంబం, అనుబంధం, సత్యం, జ్ఞానం, భార్య, మంచిగుణం, అవకాశం, కర్మ వంటి ఎన్నో నిత్యజీవిత విషయాలు చర్చించబడ్డాయి. ఉదా: "ఒక సజ్జనునికి చిరునవ్వు దానగుణం, న్యాయబుద్ధి, మంచి పలుకులు ముఖ్యం" అని అంటాడు తిరువళ్ళువర్.

 

రామానుజాచార్యులు(1017-1137):- 

      రామానుజాచార్యులు క్రీ. పూ. 1017లో పెరంబూరులో జన్మించారు. బాల్యం నుంచీ ఇతను చాలా తెలివైన విద్యార్థి. గురువుల బోధనలలోనే లోపాలు కనిపెట్టేవాడు. ఇతని భార్య చాదస్తం భరించలేకనే ఇతను సన్యాసం స్వీకరించాడు. ఆ తరువాత శ్రీరంగంలో "వైష్ణవ మఠాధిపతి" అయినాడు. తన గురువుగారి ఆజ్ఞ ప్రకారం "విశిష్టాద్వైతానికి" భాష్యం రచించాడు. అలాగే తాను స్వంతంగా 'వేదాంతసారం', 'వేదాంత సంగ్రహం', 'వేదాంత దీపం' అనే గ్రంథాలనూ రచించాడు. అనేకసార్లు పరిశీలించిన తరువాతే 'స్వామినంబి' రామానుజానికి "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని ఉపదేశించి దీనిని చాలా రహస్యంగా ఉంచమని చెప్పాడు. అయితే వెంటనే రామానుజుడు సకల జనులను కుల, మత, వర్గ బేధం లేకుండా గుడివద్ద సమావేశపరచి ఆ గుడి గోపురమెక్కి తనకు తెలిసిన మంత్రాన్ని అందరికీ బిగ్గరగా బహిర్గతపరచాడు. అటు తరువాత తన చర్యకు బదులుగా "ఈ మంత్రం వినటం వల్లా సకల జనులు స్వర్గం పొందగలిగితే, వారికి ఈ మంత్రం ఉపదేశించిన పాపానికి నేను నరకం భరించడానికి కూడా సిద్ధమే" అన్నాడు. అక్కడి హరిజనులందరికీ దేవాలయ ప్రవేశం కలిగించాడు. 120 సంవత్సరాల తన జీవిత యానంలో హైందవ దేవాలయాల విధి నిర్వహణ, పూజాదికాలను ససాంప్రదాయంగా నిర్ణయించిన ఘనత రామానుజులదే!!

 

బసవేశ్వరుడు(1131-1167):-

      లింగధారులకి ప్రముఖ గురువు. కర్నాటక సాహిత్యంలో గొప్ప పండితుడు, జ్ఞాని. ఇతను పరమశివుని నంది అవతారమని ప్రజలు భావిస్తారు. తన గురువు సంగమేశ్వరుని వద్ద దాదాపు 12 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందాడు. అన్ని మతాలు, అందరు దేవుళ్ళూ ఒక్కటేననీ, మనిషే భగవంతుని దేవాలయమని ప్రవచించాడు. "మానవ సేవే మాధవ సేవ" అని ఆచరించి చూపాడు. 

 

మధ్వాచార్యులు(1238-1317):- 

ఒకరోజు ఓ సన్యాసి తన శిష్యబృందంతో గంగా నదిని దాటుతున్నాడు. అటువైపు ఉన్నది ముస్లిం రాజ్యం. అక్కడి సైనికులు ఈ సన్యాసులను చూచి దాడి చేయటానికి ప్రయత్నించగా ఆ బృందం నాయకుడైన స్వామి ఆ సైనికులతో మేము మీ రాజును చూడటానికి వస్తున్నాం, యుద్ధానికి కాదు అన్నాడు. ఇది విన్న రాజు నా సైన్యంలోకి రావటానికి మీకు ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించాడు. అందుకా సన్యాసి "ఓ రాజా! మనలందరినీ రక్షించే ప్రభువు పైన ఉన్నాడు. కాకపోతే మీరు అతనిని "అల్లా" అంటారు. మాకు అతడు "నారాయణుడు" అంతే అని ధైర్యంగా సమాధానం చెప్పాడు. అతడే మధ్వాచార్యుడు. మధ్వాచార్యుడు "ద్వైత" సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కులాల కంపుతో పతనమౌతున్న జాతికి "భగవంతుని సృష్టిలో అందరూ సమానమే అని" చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ పరిధిని తెలుసుకొని భగవంతుని శరణు కోరాలి అంటాడు. ఇంకా, నిజమైన పని ఇతరులకు సేవ చేయటమే అంటాడు మధ్వాచార్యుడు. క్రీ. పూ. 1238లో జన్మించిన మధ్వాచార్యుడు 12వ ఏటనే సన్యాసం స్వీకరించాడు. తన జీవితం మొత్తం వేద విజ్ఞాన వ్యాప్తికే పాటుపడ్డాడు. భగవద్గీతకు, పది ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాడు. 1317లో తనవారి నుంచి అనుమతి తీసుకొని బదరీ ప్రయాణమైన మధ్వాచార్యుడు ఆ తరువాత ఎవరికీ కనిపించలేదు. 

 

స్వామి జ్ఞానేశ్వర్(1275-1296):- 

         13వ శతాబ్దంలో మహారాష్ట్రలో జన్మించిన జ్ఞానేశ్వర్ సాహిత్యాన్ని, భక్తినీ రంగరించి మోక్షమార్గంగా అంతః దృష్టిని పెంపొందించారు. మానవులలో దుష్టబుద్ది నశించి, విశ్వమానవ ప్రేమతత్వం జనించాలని ఆకాంక్షించాడు. భగవద్గీతను చక్కగా, శ్రావ్యంగా గానం చేశాడు. 


__._,_.___

Posted by: jajisarma@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

Hindu Devotional Blog Feed

Hindu Devotional Blog Feed


Srikrishna Radha Devi Images

Posted: 07 Feb 2015 11:47 PM PST

Srikrishna Radha Devi Images. The paintings of Radha and Krishna are very much loved by everyone. Radha or Radharani is always depicted alongside Srikrishna. Radha is the most important gopi in Raas (Special kind of dance) with Lord Krishna. Here are some beautiful and lovely Radha Krishna paintings.

Story of Bhairav Avatar Bhairava

Posted: 07 Feb 2015 10:06 PM PST

Shiva Purana deals with the story of Bhairav Avatar or Bhairava. Lord Mahavishnu, the protector of the world and Lord Brahma, the creator of the world, started   a heated word exchange. Each one claimed that he was the Lord of the universe. While their word-war was going on, there appeared in between them, a pillar of fire (in some texts it says a white and fat phallus). Also they heard a

Shiva Linga Pooja Images

Posted: 07 Feb 2015 08:03 PM PST

Shiva Linga Pooja Images. Below are some auspicious pictures of Shiva Abhishekam done to Shivaling using Vibhuti, Sandalwood paste and water or Tender Coconut water. Abhishek is performed to Shivalinga representing his manifestation as a creator of good. Shiva Lingam decorated after abhishekam Image. Priest performing Shiva Linga abhishek with Bhasma or Vibhuti (holy ash)  Jala

Bhuleshwar Shiva Temple Yawat Pune

Posted: 07 Feb 2015 06:25 PM PST

Bhuleshwar Temple is an ancient Shiva shrine located on the Pune - Solapur Highway in Yawat (Yavat), Maharashtra. The temple constructed in the 13th century has been declared as a protected monument. The temple, built during the era of Pandavas, features beautiful carvings on the walls and is visited by devotees as well as travelers. Bhuleshwar Shiva Temple is around 45 km from Pune and 10 km

www.telugubhakti.com Quotable Quote

 

గాంధీజీ అహింస

అవశ్యాచరణీయమైన అహింస కూడా అన్ని యెడల, అన్ని చోట్లా, అన్ని వేళలా పనికిరాదు. గంధీజీ వంటి అహింసావ్రతుడు కూడా బాధా విముక్తి కొరకు హింస అవలంబించవలసి వచ్చింది. 

-- పరమాచార్య  -- 


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (147)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

www.telugubhakti.com Quotable Quote

 

ఇతర ధర్మాలన్నీ వేదం నుంచే

ఇతర మతకర్తలు చెప్పిన ధర్మాలన్నీ పరిశీలించిచూస్తే, అవి వేదాలలోనే కనిపిస్తాయి. ఇతర ధర్మ గ్రంథాలన్నీ వేదాలకు పిమ్మటనే పుట్టినట్టు చరిత్రవల్ల తెలుస్తుంది. వేదాలు చెప్పని ధర్మమూ, సత్యమూ లేవు. వేదమెప్పుడు పుట్టిందో మనం నిర్ణయయించలేము. వేదకాల నిర్ణయం చేయబూనడం నక్షత్రాన్ని గణించడమ్ వంటిది. 

-- పరమాచార్య --


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (146)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

www.telugubhakti.com Quotable Quote

 

మతప్రాధాన్యం 

మతమొక్కటే ప్రజాసమూహాన్నీ, దేశాన్ని కూడగట్టగలదు. ఏకాత్మభావం, ఏకధర్మం - వీని నుండి శాశ్వతమైన ఐక్యత పుట్టి వర్థిల్లుతుంది. మానవేతిహాసాన్ని పరిశేలిస్తే, మతం కంటే అధికమైన సంఘటన శక్తి మరొకటి లేదని తెలుస్తుంది. 

-- పరమాచార్య --


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (145)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

[New post] India vs Australia warm-up match: Australia beat India by 106 runs

manateluguguru posted: "India were beaten by 106 runs by hosts Australia in their first warm-up match for the World Cup at the Adelaide Oval here Sunday. Australian opener David Warner (104) and Glenn Maxwell (122) helped to score huge total of 371 in 48.2 overs. Chasing a gig"

www.telugubhakti.com Quotable Quote

 

ప్రాచీనమైనదంతా పరిగ్రాహ్యం కాదు.

ప్రాచీన, పాశ్చాత్య సంస్కృతుల సమన్వయం నేడు మన ముందున్న ప్రశ్న. ఆధునిక జగత్తులోని మంచికి ప్రాచీన సంస్కృతి  ఏనాటికి వ్యతిరేకి కాదు. 'పురాణమిత్యేవ న సాధు సర్వం', ప్రాచీనమైనంత మాత్రాన దానినే సంపూర్ణంగా గ్రహించనక్కరలేదు. ప్రాచీనతతోబాటు ఉత్తమమైన నవీనత్వాన్ని కూడా స్వీకరించాలి. ప్రతి యువకుడు ఈ రెంటి సమన్వయాన్ని సాధించడం కళ్యాణప్రదం.

-- పరమాచార్య -- 


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (144)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

www.telugubhakti.com Quotable Quote

 

భక్తి ద్వారా ముక్తి

శాస్త్రచోదితకర్మలను మనం విధిగా చేయవలసి ఉంది. ఇది అవసరమా, అనవసరమా అన్న ప్రశ్నలకు తావులేదు. ఇలా కర్మానుష్ఠానం చేసిన తరువాత క్రమంగా మనకున్న రాగద్వేషాలు క్షీణించి, చిత్తశుద్ధి ఏర్పడి, మనస్సు సమాహితమై ఈశ్వరానుసంధానము పటిష్టమవుతుంది. ఇదే భక్తి. ఇది రెండవ స్థితి. భక్తి పెరిగితే జ్ఞానప్రాప్తి. అది చరమస్థితి.

అందుచేత భక్తిని వదలి ముక్తి కోసం ప్రత్యేకంగా పాకులాడవలసిన పనిలేదు. మనలోని భక్తే తుదకు ముక్తిని అందిస్తుంది. భక్తి కోసం భగవంతున్ని ప్రార్థిస్తే చాలు. అందుకే మహానుభావులందరూ భక్తి ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తూ, భక్తిబిక్షను పెట్టావే అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ భక్తి మనకు లభించిందంటే ముక్తి కరతలామలకమే. 

-- పరమాచార్య --


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (148)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

[New post] చికిత్స పొందుతూ కన్నుమూసిన టీవీ9 న్యూస్ రీడర్ బద్రి చిన్నకుమారుడు

manateluguguru posted: "పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బద్రి చిన్న కుమారుడు సాయి సాత్విక్(8) కూడా ప్రాణాలు కోల్పోయాడు. పెద్"

www.telugubhakti.com Quotable Quote

 

స్వకర్మను వదలరాదు
జ్ఞానోదయమై కర్మావసరం లేకున్నా, స్వకర్మను వదలిపెట్టారాదని అర్జునుడికి కృష్ణ భగవానుడు బోధించాడు. అసంగ కర్మాచరణం లోక సంగ్రహానికి అవసరం.
-- పరమాచార్య


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (143)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___

www.telugubhakti.com Quotable Quote

 

లోకక్షేమం 

మన లోపాలను మనం సంస్కరించుకోని పక్షంలో లోకక్షేమం కోసం ప్రయత్నించే అధికారం మనకు లేదు. మానసిక దౌర్బల్యాన్ని అణచి, దుఃఖాతీతుడై ఆత్మోపలబ్ధినందుకున్న వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణమవుతుంది. అతడు ప్రపంచ సంస్కరణకు పాటుబడనవసరంలేదు. లోకక్షేమం తానుగా సిద్ధిస్తుంది. 

-- పరమాచార్య.


__._,_.___

Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (142)
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

.

__,_._,___