టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కేంద్రంపై ఘాటుగా స్పందించారు. తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ...మన దేశంలో ఎన్నికల నిర్వహణ వట్టి దండగ అని.... చట్ట సభలు వృథా అని.. ఈ పద్ధతి మారాలే అని అన్నారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తమలాంటి వారి సలహాలు పట్టించుకోవడంలేదని...అలాంటప్పుడు చట్ట సభలు ఎందుకని ప్రశ్నించారు.

తన దృష్టిలో చట్ట సభలన్నీ వృథాగా మారిపోయాయని....కేంద్రం తమ మాట వినకపోతే ఇక ఎంపీ ఎన్నికలు ఎందుకని జేసీ ప్రశ్నించారు.
ఎన్నికల నిర్వహణకు కొన్ని వందల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని... మాకు ప్రాధాన్యత లేనప్పుడు నేరుగా ప్రధాన మంత్రి ని, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే సరిపోతుంది కదా అని ఘాటైన విమర్శలు చేశారు.