తన కుమారుడు, మనువడను చూడ్డానికి అమెరికా వెళ్ళిన సురేష్ భాయ్ పటేల్ అనే భారతీయ వృద్ధుడు పై అమెరికా పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేసి అరెస్ట్ చేశారు.

సురేష్ భాయ్ పటేల్ కి ఇంగ్లీషు రాకపోవడంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. దాంతో పోలీసులు తమ జులుం ను ప్రదర్శించి అతన్ని ఫోర్సు తో నేలమీద పడేశారు. దాంతో సురేష్ భాయ్ పటేల్ వెన్నుకు తీవ్రంగా దెబ్బతిని నిలబడలేని పరిస్తితిలోకి వెళ్లి పోయాడు.

ఈ ఘటనపై మాడిసన్ నగర పోలీసు చీఫ్ పటేల్ కు క్షమాపణలు చెప్పారు. పటేల్ కుటుంబానికి, ఎన్నారైలు అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

దాడి చేసిన పోలీసుల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ వీడియోని యుట్యూబ్ లో చూసిన ప్రజలు అమెరికా పోలీసుల అమానుష చర్యలను ఎండగడుతున్నారు.