రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో దానికి కట్టుబడి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ తమ నిరసనలను ముమ్మరం చేసింది.
పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ ఎంపీలు ధర్నాకు దిగి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు నినాదాలు చేశారు.
ఈ ధర్నాలో ఏఐసీసీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దిగ్విజయ్‌సింగ్‌ తో పాటు అంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు రఘువీరా రెడ్డి, జేడీశీలం, కేవీపీ, సుబ్బిరామిరెడ్డి, సి.రామాచంద్రయ్య, శైలజానాథ్‌, పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు.