[racchabanda] అభ్రకము (ప్రమోదతిలకా) #abhrakamu (pramOdatilakA)#

 

అభ్రకము (ప్రమోదతిలకా) - 

ఆధారము - హేమచంద్రుడు, దుఃఖభంజనకవి 

ఈ వృత్తము వసంతతిలకములో చివరి గురువును తొలగించగా లభించినది. వృత్త సంఖ్య రెంటికీ ఒకటే. ఇందులో కూడ ఇంద్రవంశమువలె పాదములో మూడు పంచమాత్రలు, ఒక చతుర్మాత్ర. కాని చతుర్మాత్ర స్థానము ఇంద్రవంశములో రెండవది అయితే, ఇందులో అది మూడవది. 

అభ్రకము (ప్రమోదతిలకా) - త/భ/జ/జ/గ UUI UIII - UII UIU
13 అతిజగతి 2933 

నీచూపునందుగల - నెమ్మిని జూడఁగా 
నాచిన్ని మానసము - నవ్వెను హాయిగా 
నీచిత్ర కావ్యమున - నిద్దరు ప్రేమతో 
యాచింతు మాప్రభువు - నాశయ సిద్ధికై 

కన్నా ప్రమోదతిల-కమ్ముగ రమ్మురా 
కన్నార నిన్ను గనఁ - గామము గల్గెరా 
యిన్నాళ్లు వేచితిని - యెందుకు రావు నే 
నెన్నాళ్లు వేచుటయొ - యెప్పుడు వత్తువో 

శోభించె నభ్రకము - సుందర తారలన్ 
శోభించె నీవసుధ - సొంపుగ రంగులన్ 
శోభించె మానసము - సుందరి జ్ఞప్తితో 
రాభామినీ యిపుడు - రమ్య విభావరిన్ 
(అభ్రకము = ఆకాశము) 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
abhrakamu (pramOdatilakA) - 

aadhAramu - hEmachaMdruDu, du@hkhabhaMjanakavi 

ee vRttamu vasaMtatilakamulO chivari guruvunu tolagiMchagA labhiMchinadi. vRtta saMkhya reMTikI okaTE. iMdulO kUDa iMdravaMSamuvale pAdamulO mUDu paMchamAtralu, oka chaturmAtra. kAni chaturmAtra sthaanamu iMdravaMSamulO reMDavadi ayitE, iMdulO adi mUDavadi. 

abhrakamu (pramOdatilakA) - ta/bha/ja/ja/ga #UUI UIII - UII UIU#
13 atijagati 2933 

nIchUpunaMdugala - nemmini jUDa@MgA 
nAchinni mAnasamu - navvenu hAyigA 
nIchitra kAvyamuna - niddaru prEmatO 
yAchiMtu mAprabhuvu - nASaya siddhikai 

kannA pramOdatila-kammuga rammurA 
kannAra ninnu gana@M - gAmamu galgerA 
yinnALlu vEchitini - yeMduku rAvu nE 
nennALlu vEchuTayo - yeppuDu vattuvO 

SObhiMche nabhrakamu - suMdara tAralan 
SObhiMche nIvasudha - soMpuga raMgulan 
SObhiMche mAnasamu - suMdari j~naptitO 
rAbhAminI yipuDu - ramya vibhAvarin 
(abhrakamu = aakASamu) 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: