[racchabanda] కిరాత (కుటిలగతి) #kirAta (kuTilagati)#

 

కిరాత (కుటిలగతి) - 

ఆధారము - జయదామన్, వాగ్వల్లభ 
జయదామన్‌లో ఈ వృత్తము వృత్తరత్నాకరములో నున్నట్లు చెప్పబడినది. కాని నా ప్రతులలో లేదు. కుటిలగతి పేరుతో మఱొక వృత్తము గలదు. కాని వాగ్వల్లభలో కిరాత అనే పేరుతో నున్నది. 

ఇందులోని విశేషము ఏమనగా - పాదములో వరుసగా ఒక చతుర్మాత్ర, మూడు పంచమాత్రలు ఉన్నాయి. 

కిరాత - చ/పం - పం/చ 
ఇంద్రవంశ - పం/చ - పం/పం 
అభ్రకము - పం/పం - చ/పం 
వనమయూరము - పం/పం - పం/చ  

కిరాత (కుటిలగతి) - న/జ/త/త/గ IIII UIU - UIU UIU 
13 అతిజగతి 2352

చెలువపు శిల్పమో - చిత్రమో నీవు నా 
వలపుకుఁ దల్పమో - వాంఛలో మూలుగో 
కలలకుఁ గావ్యమో - కైతలో నందమో 
తెలుఁగుకుఁ దీపియో - తేరుపైఁ డెక్కెమో 

కుటిలగతిన్ గురుల్ - కోమలమ్మే జడన్ 
యటునిటు నాడఁగా - నందమౌ సర్పమే 
నటనము చాలులే - నాదరిన్ రా ప్రియా 
స్ఫుటమగు ప్రేమలో - సుందరమ్మే సదా

కనఁగఁ గిరాతకుల్ - కావ్య చౌర్యమ్ములో 
మనుచును నుందురే - మర్మమై వారికిన్ 
దినమిది కార్యమే - దేవి నా ఛందముల్ 
విను మవి నీకు నా - ప్రేమతోఁ గాన్కలే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు 
#
kirAta (kuTilagati) - 

aadhAramu - jayadAman, vAgvallabha 
jayadAman^lO ee vRttamu vRttaratnAkaramulO nunnaTlu cheppabaDinadi. kAni nA pratulalO lEdu. kuTilagati pErutO ma~roka vRttamu galadu. kAni vAgvallabhalO kirAta anE pErutO nunnadi. 

iMdulOni viSEshamu EmanagA - pAdamulO varusagA oka chaturmAtra, mUDu paMchamAtralu unnAyi. 

kirAta - cha/paM - paM/cha 
iMdravaMSa - paM/cha - paM/paM 
abhrakamu - paM/paM - cha/paM 
vanamayUramu - paM/paM - paM/cha  

kirAta (kuTilagati) - na/ja/ta/ta/ga #IIII UIU - UIU UIU# 
13 atijagati 2352

cheluvapu SilpamO - chitramO nIvu nA 
valapuku@M dalpamO - vAMChalO mUlugO 
kalalaku@M gAvyamO - kaitalO naMdamO 
telu@Mguku@m dIpiyO - tErupai@M DekkemO 

kuTilagatin gurul - kOmalammE jaDan 
yaTuniTu nADa@MgA - naMdamau sarpamE 
naTanamu chAlulE - nAdarin rA priyA 
sphuTamagu prEmalO - suMdarammE sadA

kana@Mga@M girAtakul - kAvya chauryammulO 
manuchunu nuMdurE - marmamai vArikin 
dinamidi kAryamE - dEvi nA ChaMdamul 
vinu mavi nIku nA - prEmatO@M gAn&kalE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: