[racchabanda] వాణి, హర్షవర్ధన, హిమాస్పద - అష్టపది 33 #vANi, harshavardhana, himAspada - ashTapadi 33# Must-read article

 

వాణి, హర్షవర్ధన, హిమాస్పద - అష్టపది 33  

నిన్న వాణి వృత్తమునుగుఱించి చెప్పినాను. చంపకోత్పలమాలలో మొదటి చతుర్మాత్రను తొలగిస్తే ఈ వృత్తము లభిస్తుందని కూడ తెలిపినాను. ఇప్పుడు ఒక ప్రయోగము చేద్దామా?  ఈ వాణి వృత్తమునకు చివర ఒక చతుర్మాత్రను (గగము లేక స-గణము) తగిలిద్దామా? అలా చేసినప్పుడు మనకు రెండు వృత్తములు పుడుతాయి. అవి - 

వాణి - ర/న/భ/భ/ర/లగ UIU III - UII UII - UIUIU
17 అత్యష్టి 44475 

1) వాణి + UU = హర్షవర్ధన - ర/న/భ/భ/ర/య/గ 
UIU III - UII UII - UIUIU UU
19 అతిధృతి 44475 

2) వాణి + IIU = హిమాస్పద - ర/న/భ/భ/ర/జ/లగ 
UIU III - UII UII - UIUIU IIU
20 కృతి 437691 

ఈ రెండు వృత్తములను నిశితముగా పరిశీలిస్తే, వీటికి ప్రతి పాదములో మూడు అష్ట మాత్రలు, ఒక చతుర్మాత్ర ఉన్నాయి. శ్రీజయదేవుడు విరివిగా వ్రాసిన అష్టపదుల లక్షణము ఇది. కావున హర్షవర్ధన, హిమాస్పద వృత్తములు అష్టపదుల నిర్మాణమునకు మూసలుగా ఉపయోగ పడుతాయి. క్రింద ప్రతి వృత్తమునకు రెండు ఉదాహరణములు. ఇవన్నియు చతుష్పదులే. ఐనా అష్టపదికి సరిపోయేటట్లు ద్విపదలుగా చూపబడినవి.. ఒక ధ్రువమును (పల్లవిని) కూడ చేర్చినాను పాడుకొనుటకై. పాదాంతములోని ద్రుతమును పాడేటప్పుడు వర్జించి ముందున్న హల్లును సాగదీయవచ్చును, ఉదా. వచ్చెన్ -> వచ్చే. 

మాధవా యనఁగ - మానస మయ్యెను - మందిరమ్ముగా నేఁడే 
రాధతో మనఁగ - రంజిలగా నతి - రమ్య వేళ యీనాఁడే
 
సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా ... ధ్రువము (1)

హ్లాద మీయఁగను - హాసపు కాంతుల - హర్షవర్ధనా రారా 
మీఁద క్రిందులగు - మేనిఁక పొంగిడు - మేరుపర్వతాకారా 

సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా ... (2) 

ఈవసంతమున - నింపిడు రంగుల - నీవనమ్ము శోభించెన్ 
బూవు లందముగ - మోదము నిచ్చుచుఁ - బుల్కరించఁ గంపించెన్ 

సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా  ... (3)

రావదేల నను - రంజిలఁ జేయఁగ - రత్నహారి రంగేశా 
దేవళమ్ము హృది - దీప్తుల నిండెను - దేహ మిత్తు నీకీశా 

సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా ... (4)

మత్తకోకిలలు - మత్తిలి పాడఁగ - మంచి నాదమే వినఁగా 
చిత్త మయ్యె నొక - సింధువుగా నిట - చెల్వమే సదా కనఁగా 

సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా ... (5) 

మెత్తమెత్తగను - మెల్లని గాలులు - మేని దాఁకఁగా ముదమే 
ముత్తియమ్ము లన - మొగ్గలపైఁ జిఱు - బొట్టు లా హిమాస్పదమే 

సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా .... (6) 

చందనమ్ము గడు - చల్లఁగఁ బూసెద - చారుదేహ సత్వరమై 
స్యందనమ్ముపయిఁ - జక్కఁగ రమ్ముర - సంధ్యవేళలో వరమై 

సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా ... (7) 

నందనందనుఁడ - నాదరిఁ జేరర - నామనోహరా రమణా 
ముందు నిల్చి స్మర - మోహన రాగపు - ముద్దులిమ్ము మారమణా 

సారసాక్ష నను జేరఁగ రావా 
స్ఫారమైన నును బ్రేమము తేవా ... (8) 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vANi, harshavardhana, himAspada - ashTapadi 33  

ninna vANi vRttamunugu~riMchi cheppinAnu. chaMpakOtpalamAlalO modaTi chaturmAtranu tolagistE ee vRttamu labhistuMdani kUDa telipinAnu. ippuDu oka prayOgamu chEddAmA?  ee vANi vRttamunaku chivara oka chaturmAtranu (gagamu lEka sa-gaNamu) tagiliddAmA? alA chEsinappuDu manaku reMDu vRttamulu puDutAyi. avi - 

vANi - ra/na/bha/bha/ra/laga #UIU III - UII UII - UIUIU#
17 atyashTi 44475 

1) vANi + #UU# = harshavardhana - ra/na/bha/bha/ra/ya/ga 
#UIU III - UII UII - UIUIU UU#
19 atidhRti 44475 

2) vANi + #IIU# = himAspada - ra/na/bha/bha/ra/ja/laga 
#UIU III - UII UII - UIUIU IIU#
20 kRti 437691 

ee reMDu vRttamulanu niSitamugA pariSIlistE, vITiki prati pAdamulO mUDu ashTa mAtralu, oka chaturmAtra unnAyi. SrIjayadEvuDu virivigA vrAsina ashTapadula laxaNamu idi. kAvuna harshavardhana, himAspada vRttamulu ashTapadula nirmANamunaku mUsalugA upayOga paDutAyi. kriMda prati vRttamunaku reMDu udAharaNamulu. ivanniyu chatushpadulE. ainA ashTapadiki saripOyETaTlu dvipadalugA chUpabaDinavi. oka dhruvamunu (pallavini) kUDa chErchinAnu pADukonuTakai. pAdAMtamulOni drutamunu pADETappuDu varjiMchi muMdunna hallunu sAgadIyavachchunu, udA. vachchen -> vachchE. 

mAdhavA yana@Mga - mAnasa mayyenu - maMdirammugA nE@MDE 
rAdhatO mana@Mga - raMjilagA nati - ramya vELa yInA@MDE
 
sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA ... dhruvamu (1)

hlAda mIya@Mganu - hAsapu kAMtula - harshavardhanA rArA 
mI@Mda kriMdulagu - mEni@Mka poMgiDu - mEruparvatAkArA 

sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA ... (2) 

eevasaMtamuna - niMpiDu raMgula - nIvanammu SObhiMchen 
bUvu laMdamuga - mOdamu nichchuchu@M - bulkariMcha@M gaMpiMchen 

sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA  ... (3)

rAvadEla nanu - raMjila@M jEya@Mga - ratnahAri raMgESA 
dEvaLammu hRdi - dIptula niMDenu - dEha mittu nIkISA 

sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA ... (4)

mattakOkilalu - mattili pADa@Mga - maMchi nAdamE vina@mgA 
chitta mayye noka - siMdhuvugA niTa - chelvamE sadA kana@MgA 

sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA .... (5) 

mettamettaganu - mellani gAlulu - mEni dA@Mka@MgA mudamE 
muttiyammu lana - moggalapai@M ji~ru - boTTu lA himAspadamE 

sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA ... (6) 

chaMdanammu gaDu - challa@Mga@M bUseda - chArudEha satvaramai 
syaMdanammupayi@M - jakka@Mga rammura - saMdhyavELalO varamai 

sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA ... (7) 

naMdanaMdanu@MDa - nAdari@M jErara - nAmanOharA ramaNA 
muMdu nilchi smara - mOhana rAgapu - muddulimmu mAramaNA 

sArasAxa nanu jEra@Mga rAvA 
sphAramaina nunu brEmamu tEvA ... (8) 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: