[racchabanda] అర్ధసమ వృత్తము చిగురుకల #ardhasama vRttamu chigurukala#

 

అర్ధసమ వృత్తము చిగురుకల - 

ఆధారము - కల్పితము 
(స్ఫూర్తి - చిగురులు వేసిన కలలన్నీ // సిగలో పూలుగ మారినవి)

బేసి పాదములు - న/జ/న/గగ - 11 త్రిష్టుప్పు 496 
సరి పాదములు - స/భ/భ/గ - వారవతీ - 12 జగతి 436

చిగురుకల - IIII UII - IIUU // IIU UII - UIIU

చిగురు కలల్ హృది - చిఱునవ్వుల్ 
సిగరమ్మందున - శీకరముల్ 
జగమునఁ బ్రేమపు - స్వరగీతుల్ 
సుగమౌ యాత్రకు - సొంపు దివెల్ 

మమతల నాదము - మధురమ్మై 
సుమసందర్శన - సూనృతమై 
హిమకర కౌముది - హేమములై 
రమణీయమ్ముగఁ - బ్రాఁకె హృదిన్ 

వలపుల రాగపు - స్వరరాశుల్ 
కలగీతమ్ముల - కబ్బములే 
చెలిమికి రూపము - చిఱునవ్వుల్ 
సెలగా పారిన - చెల్వములే 

వరదుని గాంచుట - వరమేగా 
హరి నామమ్ముల్ - హర్షమెగా 
చిఱునగ వెప్పుడు - శివమేగా 
సిరికిన్ నాథుఁడు - జీవమెగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu chigurukala - 

aadhAramu - kalpitamu 
(sphUrti - chigurulu vEsina kalalannI // sigalO pUluga mArinavi)

bEsi pAdamulu - na/ja/na/gaga - 11 trishTuppu 496 
sari pAdamulu - sa/bha/bha/ga - vAravatI - 12 jagati 436

chigurukala - #IIII UII - IIUU // IIU UII - UIIU#

chiguru kalal hRdi - chi~runavvul 
sigarammaMduna - SIkaramul 
jagamuna@M brEmapu - svaragItul 
sugamau yAtraku - soMpu divel 

mamatala nAdamu - madhurammai 
sumasaMdarSana - sUnRtamai 
himakara kaumudi - hEmamulai 
ramaNIyammuga@M - brA@Mke hRdin 

valapula rAgapu - svararASul 
kalagItammula - kabbamulE 
chelimiki rUpamu - chi~runavvul 
selagA pArina - chelvamulE 

varaduni gAMchuTa - varamEgA 
hari nAmammul - harshamegA 
chi~runaga veppuDu - SivamEgA 
sirikin nAthu@MDu - jIvamegA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: