[racchabanda] అర్ధసమ వృత్తము మధురవచనము #ardhasama vRttamu madhuravachanamu#

 

అర్ధసమ వృత్తము మధురవచనము - 

ఆధారము - కల్పితము 
బేసి పాదములు - శార్దూలవిక్రీడితము
సరి పాదములు - మందాక్రాంతము

మధురవచనము -  
UUU IIUI - UIIIU - UUI UUIU // UUUU - III IIU - UIU UIUU

శ్రీరామా రఘువంశ - శీతకిరణా - సీతాప్రియా చిన్మయా 
నీరేజాక్షా - నృపకులమణీ - నిత్యసత్యానుశీలా 
ధీరా వీరవరేణ్య - దివ్యవదనా - దేవాధిదేవా హరీ 
మారాకారా - మధురవచనా - మమ్ము పాలించ రావా 

రామా రాజమణీంద్ర - రావణహరా - రత్నప్రభాద్యోతకా 
శ్యామాకారా - సరసహృదయా - స్వర్ణకోటీరధారీ 
భూమీశా భువనేశ - పుణ్యపురుషా - పూర్ణేందుబింబాననా 
స్వామీ నిన్నే - ప్రవిమలముగా - భక్తితో సేవ సేతున్ 

శార్దూలవిక్రీడితములో రెండు అక్షరములను తొలగించినప్పుడు దానికి మందాక్రాంతపు లయ గలదని ఇంతకుముందే నేను నిరూపించినాను. మందాక్రాంతమువలె శార్దూలవిక్రీడితమునకు అదనముగా యతిని ఉంచినాను. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu madhuravachanamu - 

aadhAramu - kalpitamu 
bEsi pAdamulu - SArdUlavikrIDitamu
sari pAdamulu - maMdAkrAMtamu

madhuravachanamu -  
#UUU IIUI - UIIIU - UUI UUIU // UUUU - III IIU - UIU UIUU#

SrIrAmA raghuvaMSa - SItakiraNA - sItApriyA chinmayA 
nIrEjAxA - nRpakulamaNI - nityasatyAnuSIlA 
dhIrA vIravarENya - divyavadanA - dEvAdhidEvA harI 
mArAkArA - madhuravachanA - mammu pAliMcha rAvA 

rAmA rAjamaNIMdra - rAvaNaharA - ratnaprabhAdyOtakA 
SyAmAkArA - sarasahRdayA - svarNakOTIradhArI 
bhUmISA bhuvanESa - puNyapurushA - pUrNEMdubiMbAnanA 
svAmI ninnE - pravimalamugA - bhaktitO sEva sEtun 

SArdUlavikrIDitamulO reMDu axaramulanu tolagiMchinappuDu dAniki maMdAkrAMtapu laya galadani iMtakumuMdE nEnu nirUpiMchinAnu. maMdAkrAMtamuvale SArdUlavikrIDitamunaku adanamugA yatini uMchinAnu. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: