[racchabanda] అతిశాయినీ #atiSAyinI#

 

అతిశాయినీ - 

ఆధారము - హేమచంద్రుడు, దీనిని మొట్టమొదట మాఘుడు వాడినాడు

అతిశాయినీ - స/స/జ/భ/జ/గగ IIU IIUI UI - UI IIUI UU 
17 అత్యష్టి 23900 

మనసా వలదింక బాధ - వాఁడు చనుదెంచు నీకై 
వినవే యెదలోని గీతి - ప్రేమ ధ్వనియించెఁ గాదా 
కనఁగా నినువీడలేఁడు - కామమున గోరు నిన్నే 
తనువో తను వచ్చినంత - తాళమును వేయుఁగాదా 

సరసమ్ములతోడ వచ్చు - చక్కఁగను బాడు నీకై 
హరుసమ్ముల నెన్నొ యిచ్చు - హాసములఁ జేయు నీతోఁ  
గురులందున బూల గ్రుచ్చు - గోముగను మాటలాడున్ 
శిరమున్ దన చేతులందుఁ - జేర్చి నిను ముద్దులాడున్ 

అతిశాయినియంచు నిన్ను - హర్షమున సన్నుతింతున్ 
మతిలో సతతమ్ము నీవె - మందమతి నేను దేవీ 
గతి చూపఁగ రమ్ము వేగ - గమ్య మెటు బోవ వచ్చున్ 
ద్యుతిఁ జిమ్మఁగ దీపమొండు - దూరమున జూపవమ్మా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
atiSAyinI - 

aadhAramu - hEmachaMdruDu, dInini moTTamodaTa mAghuDu vADinADu

atiSAyinI - sa/sa/ja/bha/ja/gaga #IIU IIUI UI - UI IIUI UU# 
17 atyashTi 23900 

manasA valadiMka bAdha - vA@MDu chanudeMchu nIkai 
vinavE yedalOni gIti - prEma dhvaniyiMche@M gAdA 
kana@MgA ninuvIDalE@MDu - kAmamuna gOru ninnE 
tanuvO tanu vachchinaMta - tALamunu vEyu@MgAdA 

sarasammulatODa vachchu - chakka@Mganu bADu nIkai 
harusammula nenno yichchu - hAsamula@M jEyu nItO@M  
gurulaMduna bUla gruchchu - gOmuganu mATalADun 
Siramun dana chEtulaMdu@M - jErchi ninu muddulADun 

atiSAyiniyaMchu ninnu - harshamuna sannutiMtun 
matilO satatammu nIve - maMdamati nEnu dEvI 
gati chUpa@Mga rammu vEga - gamya meTu bOva vachchun 
dyuti@M jimma@Mga dIpamoMDu - dUramuna jUpavammA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: