[racchabanda] చమరీచమరము #chamarIchamaramu#

 

చమరీచమరము - 

ఆధారము - వాగ్వల్లభ 
నడక - 4,5 - 5,5 మాత్రలు 

చమరీచమరము - న/న/ర/న/ర IIII IIUI - UIII UIU 
15 అతిశక్వరి 11968

కలువల కనులందుఁ - గజ్జలము రాత్రియో 
వెలుఁగిడు మొగమందు - వెన్నెలలు ప్రేమయో 
చిలిపిగఁ దొణికించు - స్మేరములు సైగలో 
చెలువకు మనమందుఁ - జింతనము లేమిటో 

సుమములు విరియంగ - సోయగము లామనిన్ 
భ్రమరము లమరంగ - భారమగుఁ బుష్పముల్ 
విమలము వాతములు - విరిగంద మెల్లెడన్ 
రమణుని రాకకయి - రక్తి నిట వేచితిన్ 

మది నిను దలువంగ - మాయమగు వేదనల్ 
ముదమున హృదయమ్ము - ఫుల్లమగుఁ బుష్పమై 
వదలను నిను నేను - ప్రాణ మిల నుండఁగాఁ 
జదువుల జవరాల - చల్లఁగను జూడుమా 

దీని గతి ఆటవెలది బేసి పాదములవలె కూడ ఉంటుందని ఇంతకు ముందు చెప్పియున్నాను.. మఱొక అట్టి ఉదాహరణము - 

3,3,3 - 5,5 మాత్రల గతితో - 

కమల దళము వంటి - కన్నులకుఁ గామనల్ 
భ్రమరకముల కేశ - వల్లరికిఁ గామనల్ 
జమిలి చెవుల శ్రీకి - సాంద్ర రవ కామనల్ 
కొమరు వయసు కొమ్మ - కూరిమికిఁ గామనల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chamarIchamaramu - 

aadhAramu - vAgvallabha 
naDaka - 4,5 - 5,5 mAtralu 

chamarIchamaramu - na/na/ra/na/ra #IIII IIUI - UIII UIU# 
15 atiSakvari 11968

kaluvala kanulaMdu@M - gajjalamu rAtriyO 
velu@MgiDu mogamaMdu - vennelalu prEmayO 
chilipiga@M doNikiMchu - smEramulu saigalO 
cheluvaku manamaMdu@M - jiMtanamu lEmiTO 

sumamulu viriyaMga - sOyagamu lAmanin 
bhramaramu lamaraMga - bhAramagu@M bushpamul 
vimalamu vAtamulu - virigaMda melleDan 
ramaNuni rAkakayi - rakti niTa vEchitin 

madi ninu daluvaMga - mAyamagu vEdanal 
mudamuna hRdayammu - phullamagu@M bushpamai 
vadalanu ninu nEnu - prANa mila nuMDa@MgA@M 
jaduvula javarAla - challa@mganu jUDumA 

deeni gati aaTaveladi bEsi pAdamulavale kUDa uMTuMdani iMtaku muMdu cheppiyunnaanu. ma~roka aTTi udAharaNamu - 

3,3,3 - 5,5 mAtrala gatitO - 

kamala daLamu vaMTi - kannulaku@M gAmanal 
bhramarakamula kESa - vallariki@M gAmanal 
jamili chevula SrIki - sAMdra rava kAmanal 
komaru vayasu komma - kUrimiki@M gAmanal 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: