[racchabanda] చండవృష్టిప్రపా(యా)తము #chaMDavRshTiprapA(yA)tamu#

 

చండవృష్టిప్రపా(యా)తము - 

పాదమునకు రెండు న-గణములు, ఏడు ర-గణములు. నేను మూడేసి గణములకు అక్షరసామ్య యతిని, ప్రాసను ఉంచినాను. పద్య దండకములలో ఇది మొదటిది. 

చండవృష్టిప్రపాతము - న/న/ర - (ర)3 - (ర)3 
27 భూశ్చందము 38347968 

మనసు పిలుచుచుండఁగా - మాటలాడంగ రావేలకో - మాయలో ముంచ రావేలకో 
తనువు పిలుచుచుండఁగాఁ - దాపమున్ దీర్చ రావేలకో - దాహమున్ దీర్చ రావేలకో 
కనులు పిలుచుచుండఁగాఁ - గాకలన్ మాన్ప రావేలకో - కామమున్ దీర్చ రావేలకో 
వినఁగఁ జెవుల వెచ్చఁగాఁ - బ్రేమగీతమ్ము నాలించవా - ప్రీతితో నన్ను బాలించవా 

చదువు లొసఁగు మెప్పుడున్ - జక్కఁగాఁ జారుహాసమ్ములన్ - జండ వృష్టి ప్రపాతమ్ముగా 
ముదము గలుగు నెప్పుడున్ - ఫుల్లమౌ జ్ఞాన పుష్పమ్ముగాఁ - బొంగు నానంద సంద్రమ్ముగా 
విధిసతి వరవీణతో - వేదమంత్రమ్ములన్ మీటుమా - ప్రేమతో గీతి నేర్పించుమా 
హృదయసరసిలో సదా - నృత్యమాడంగరా హంసగా - తృప్తినీయంగ నందమ్ముగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chaMDavRshTiprapA(yA)tamu - 

pAdamunaku reMDu na-gaNamulu, EDu ra-gaNamulu. nEnu mUDEsi gaNamulaku axarasAmya yatini, prAsanu uMchinAnu. padya daMDakamulalO idi modaTidi. 

chaMDavRshTiprapAtamu - na/na/ra - (ra)3 - (ra)3 
27 bhUSchaMdamu 38347968 

manasu piluchucuMDa@MgA - mATalADaMga rAvElakO - mAyalO muMcha rAvElakO 
tanuvu piluchuchuMDa@MgA@M - dApamun dIrcha rAvElakO - dAhamun dIrcha rAvElakO 
kanulu piluchuchuMDa@MgA@M - gAkalan mAn&pa rAVElakO - kAmamun dIrcha rAvElakO 
vina@Mga@M jevula vechcha@MgA@M - brEmagItammu nAliMchavA - prItitO nannu bAliMchavA 

chaduvu losa@Mgu meppuDun - jakka@MgA@M jAruhAsammulan - jaMDa vRshTi prapAtammugA 
mudamu galugu neppuDun - phullamau j~nAna pushpammugA@M - boMgu nAnaMda saMdrammugA 
vidhisati varavINatO - vEdamaMtrammulan mITumA - prEmatO gIti nErpiMchumA 
hRdayasarasilO sadA - nRtyamADaMgarA haMsagA - tRptinIyaMga naMdammugA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: