[racchabanda] చంద్రహాసకరా #chaMdrahAsakarA#

 

చంద్రహాసకరా - 

ఆధారము - వాగ్వల్లభ 

చంద్రహాసకరా - ర/స/జ/జ/గ UIU IIUI - UII UIU 
13 అతిజగతి 2907

ఎందుకో నను జూడ - వెందుల కోప్రియా 
ముందురా ముదమీయ - మోహనునిన్ గనన్ 
చందురుం డల నింగిఁ - జల్లఁగఁ బిల్వఁగా 
సందియ మ్మిఁకనేల - చాలును బింకముల్ 

మానసమ్మున నీదు - మంజుల రూపమే 
తేనెలూరును నీవు - తెల్గునఁ బల్కఁగా 
గానసాగరమందు - గంగయు నీవెగా 
స్నానమాడుచునుందు - స్వర్ణదియందు నేన్ 

ఇంద్రనీలశరీరు - నెట్టులఁ గూల్చు నా 
చంద్రహాసకరమ్ము - సల్పఁగ యుద్ధమున్ 
సంద్రమే గద రామ-చంద్రుని శౌర్యముల్ 
చంద్రసూర్యులె వాని - జాలియుఁ గోపముల్ 
(రావణుని కత్తి పేరు చంద్రహాసము)

ఈ వృత్తమును ఒకప్పుడు ముద్దుకోకిల అనే పేరుతో మిశ్రగతి నడకతో పరిచయము చేసియున్నాను. ఆ నడకతో ఒక ఉదాహరణము - 

ముద్దుకోకిల - మోహనమ్ముగఁ బాడఁగా 
నిద్దురన్ విడి - నెమ్మి నామది యాడెఁగా 
బద్ధకమ్మది - పర్వులెత్తఁగ లేచితిన్ 
బెద్ద సూర్యుని - బింబ మొక్కటిఁ జూచితిన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
chaMdrahAsakarA - 

aadhAramu - vAgvallabha 

chaMdrahAsakarA - ra/sa/ja/ja/ga #UIU IIUI - UII UIU# 
13 atijagati 2907

eMdukO nanu jUDa - veMdula kOpriyA 
muMdurA mudamIya - mOhanunin ganan 
chaMduruM Dala niMgi@M - jalla@Mga@M bilva@MgA 
saMdiya mmi@MkanEla - chAlunu biMkamul 

mAnasammuna nIdu - maMjula rUpamE 
tEnelUrunu nIvu - telguna@M balka@MgA 
gAnasAgaramaMdu - gaMgayu nIvegA 
snAnamADuchunuMdu - svarNadiyaMdu nEn 

iMdranIlaSarIru - neTTula@M gUlchu nA 
chaMdrahAsakarammu - salpa@Mga yuddhamun 
saMdramE gada rAma-chaMdruni Sauryamul 
chaMdrasUryule vAni - jAliyu@M gOpamul 
(rAvaNuni katti pEru chaMdrahAsamu)

ee vRttamunu okappuDu muddukOkila anE pErutO miSragati naDakatO parichayamu chEsiyunnAnu. aa naDakatO oka udAharaNamu - 

muddukOkila - mOhanammuga@M bADa@MgA 
nidduran viDi - nemmi nAmadi yADe@MgA 
baddhakammadi - parvuletta@Mga lEchitin 
bedda sUryuni - biMba mokkaTi@M jUchitin 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: