[racchabanda] లలితవిక్రమ #lalitavikrama#

 

లలితవిక్రమ - 

ఆధారము - రత్నమంజూష, హేమచంద్రుడు

సంస్కృతములో పాదము 10,11గా విఱుగును. నేను యతిని 12వ అక్షరముగా ఎన్నుకొన్నాను. 

లలితవిక్రమ - భ/ర/న/ర/న/ర/ర UII UIUI IIUI - UIII UIU UIU
21 ప్రకృతి 619991 

మోహనమైన గానరసమందు - మున్గితిని నాకు నీ విశ్వమే 
మోహన రాగమయ్యెఁ బలుమారు - పుల్కలిడఁ బాడుచునుంటి స-
మ్మోహనశక్తి లాగె నను నేఁడు - మోదమున నిండె నీమానస 
మ్మాహహ చాలుచాలు బ్రదుకింక - యందమున బొంగిపోవున్ సదా 

హోరున బోరుసేయ ననియందు - నోలలితవిక్రమా నీవు సం-
హారము సల్ప వెళ్లితివిగాదె - హా యనఁగఁ దల్లియున్ దారయున్ 
జేరెదవేమొ నాకమును నీవు - చిల్లులగు డెందముల్ వారికిన్ 
మారనిదేమొ యీకథయు శాంతి - మాభువి నశాశ్వతమ్మే కదా! 

రంగని జూడ మానసమునందు - రంగులకు వెల్గులబ్బున్ గదా 
పొంగిడు బుగ్గవోలె నవి చిమ్మ - మోదమున బాడు గీతుల్ సదా 
శృంగము నందు శ్వేత హిమరాశి - శీఘ్రము గరంగి స్రోతమ్ములై 
చెంగున బారుచుండు సడితోడఁ - జెల్వము గరంగుఁ బ్రీతమ్ములై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
lalitavikrama - 

aadhAramu - ratnamaMjUsha, hEmachaMdruDu

saMskRtamulO pAdamu 10,11gA vi~rugunu. naenu yatini 12va axaramugA ennukonnAnu. 

lalitavikrama - bha/ra/na/ra/na/ra/ra #UII UIUI IIUI - UIII UIU UIU#
21 prakRti 619991 

mOhanamaina gAnarasamaMdu - mun&gitini nAku nI viSvamE 
mOhana rAgamayye@M balumAru - pulkaliDa@M bADuchunuMTi sa-
mmOhanaSakti lAge nanu nE@MDu - mOdamuna niMDe nImAnasa 
mmAhaha chAluchAlu bradukiMka - yaMdamuna boMgipOvun sadA 

hOruna bOrusEya naniyaMdu - nOlalitavikramA nIvu saM-
hAramu salpa veLlitivigAde - hA yana@Mga@M dalliyun dArayun 
jEredavEmo nAkamunu nIvu - chillulagu DeMdamul vArikin 
mAranidEmo yIkathayu SAMti - mAbhuvi naSASvatammE kadA! 

raMgani jUDa mAnasamunaMdu - raMgulaku velgulabbun gadA 
poMgiDu buggavOle navi chimma - mOdamuna bADu gItul sadA 
SRMgamu naMdu SvEta himarASi - SIghramu garaMgi srOtammulai 
cheMguna bAruchuMDu saDitODa@M - jelvamu garaMgu@M brItammulai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: