[racchabanda] మందాక్రాంత-స్రగ్ధర అర్ధసమ వృత్తము #maMdAkrAMta-sragdhara ardhasama vRttamu#

 

మందాక్రాంత-స్రగ్ధర అర్ధసమ వృత్తము - 

ఆధారము - నయమంజరి 
మందాక్రాంతమునకు మొదటి నాలుగు అక్షరముల తఱువాత IUUI చేర్చినప్పుడు మనకు స్రగ్ధర లభిస్తుంది. 

బేసి పాదములు - మందాక్రాంతము
సరి పాదములు - స్రగ్ధర 
అక్షరసామ్య యతి, విరామ యతి సంస్కృత రీతిలో నుంచినాను. 

మందాక్రాంత-స్రగ్ధర అర్ధసమ వృత్తము - 

పూలన్ దెత్తున్ - బులకితమవన్ - మొగ్గ నవ్వుల్ చెలంగన్ 
పాలన్ దెత్తున్ వరాంగా - ప్రణయపు దడతోఁ - బానమున్ జేయ రావా 
చేల మ్మిత్తున్ - జెలిమి గురుతై - శీఘ్రమే కట్టుకోవా 
మేలౌ గీతిన్ నుతింతున్ - మృదుతర గతితో - మేను పొంగంగ రావా 

సందోహమ్మై - సడుల నిడుచున్ - సంధ్యలోఁ బుల్గు లెందున్ 
మందమ్మై వీచె గాలుల్ - మధుర మధురమై - మంద్ర గీతమ్ము లెందున్ 
విందై నిండెన్ - విరులు వనిలోఁ - బెక్కు వన్నెల్ వెలింగెన్ 
స్కంధా రావేల వల్లిన్ - గనఁగను ద్వరగాఁ - గామితమ్ముల్ ఫలించన్ 

రాసక్రీడన్ - రమణులు నిశిన్ - రాజిలంగాఁ జనంగన్ 
హాసమ్ముల్ జూడ నెందున్ - హరుసపు వడిలో - హారి నృత్యమ్ములాడెన్ 
భాసమ్మయ్యెన్ - వదనములలో - వంద దీపాల వెల్గుల్ 
రాసోల్లాసమ్ము హెచ్చెన్ - రసిక హృదయముల్ - రంజిలంగా రమించెన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
maMdAkrAMta-sragdhara ardhasama vRttamu - 

aadhAramu - nayamaMjari 
maMdAkrAMtamunaku modaTi nAlugu axaramula ta~ruvAta #IUUI# chErchinappuDu manaku sragdhara labhistuMdi. 

bEsi pAdamulu - maMdAkrAMtamu
sari pAdamulu - sragdhara 
axarasAmya yati, virAma yati saMskRta rItilO nuMchinAnu. 

maMdAkrAMta-sragdhara ardhasama vRttamu - 

pUlan dettun - bulakitamavan - mogga navvul chelaMgan 
pAlan dettun varAMgA - praNayapu daDatO@M - bAnamun jEya rAvA 
chEla mmittun - jelimi gurutai - SIghramE kaTTukOvA 
mElau gItin nutiMtun - mRdutara gatitO - mEnu poMgaMga rAvA 

saMdOhammai - saDula niDuchun - saMdhyalO@M bulgu leMdun 
maMdammai vIche gAlul - madhura madhuramai - maMdra gItammu leMdun 
viMdai niMDen - virulu vanilO@M - bekku vannel veliMgen 
skaMdhA rAvEla vallin - gana@Mganu dvaragA@M - gAmitammul phaliMchan 

rAsakrIDan - ramaNulu niSin - rAjilaMgA@M janaMgan 
hAsammul jUDa neMdun - harusapu vaDilO - hAri nRtyammulADen 
bhAsammayyen - vadanamulalO - vaMda dIpAla velgul 
rAsOllAsammu hechchen - rasika hRdayamul - raMjilaMgA ramiMchen 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: