[racchabanda] ప్రభావతీ (రుచి, లక్ష్మీ) #prabhAvatI (ruchi, laxmI)#

 

ప్రభావతీ (రుచి, లక్ష్మీ) - 

ఆధారము - వృత్తరత్నాకరము 
ఇతర నామములు - రుచి, లక్ష్మీ (హేమచంద్రుడు, జయకీర్తి) 
నడక - 5,4 - 5,5 మాత్రలు 
సంస్కృతములో పాదము 4,9 గా విఱుగుతుంది. 

ఈ వృత్తమును మొట్ట మొదట వరాహమిహిరుడు వాడెను. 

ప్రభావతీ (రుచి, లక్ష్మీ) - త/భ/స/జ/గ UUI UII - IIUI UIU 
13 అతిజగతి 2805

నేనుత్తరమ్మును - నిశిలోన వ్రాయనా 
నేనిందు సౌఖ్యము - నిను దల్చుచుంటి నో 
ప్రాణేశ్వరీ యటఁ - బవళించి యుంటివా 
కానంగఁ గోరిక - కను మోడ్పు రాదుగా 

నామానసమ్మున - నగుమోము గన్పడెన్ 
నీమోహనమ్మగు - నెలవంక హాసముల్ 
ప్రేమమ్ము నింపెను - బిలువంగ రాదొకో 
నీమాటయే రుచి - నిదురించ ముందుగా 

శ్రీలక్ష్మి యుండఁగ - సిరులేల నాకిలన్ 
సాలంకృతమ్ముగ - సరసన్ బ్రభావతీ 
రా లాలిఁ బాడెద - రమణీయ గీతిగా 
నాలించుమా సకీ - యనురాగమల్లికా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
prabhAvatI (ruchi, laxmI) - 

aadhAramu - vRttaratnAkaramu 
itara nAmamulu - ruchi, laxmI (hEmachaMdruDu, jayakIrti) 
naDaka - 5,4 - 5,5 mAtralu 
saMskRtamulO pAdamu 4,9 gA vi~rugutuMdi. 

ee vRttamunu moTTa modaTa varAhamihiruDu vADenu. 

prabhAvatI (ruchi, laxmI) - ta/bha/sa/ja/ga #UUI UII - IIUI UIU# 
13 atijagati 2805

nEnuttarammunu - niSilOna vrAyanA 
nEniMdu saukhyamu - ninu dalchuchuMTi nO 
prANESvarI yaTa@M - bavaLiMchi yuMTivA 
kAnaMga@M gOrika - kanu mODpu rAdugA 

nAmAnasammuna - nagumOmu gan&paDen 
nImOhanammagu - nelavaMka hAsamul 
prEmammu niMpenu - biluvaMga rAdokO 
nImATayE ruchi - niduriMcha muMdugA 

SrIlaxmi yuMDa@Mga - sirulEla nAkilan 
sAlaMkRtammuga - sarasan brabhAvatI 
rA lAli@M bADeda - ramaNIya gItigA 
nAliMchumA sakI - yanurAgamallikA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: