[racchabanda] ప్రచిత దండకము #prachita daMDakamu#

 

ప్రచిత దండకము - 

ఆధారము - జయదేవ ఛందస్సు 
ఇందులో పాదమునకు 27 అక్షరములు గలవు. పాదమునకు రెండు న-గణములు, ఏడు య-గణములు. ఈ దండకమునకు వృత్తములవలె నాలుగు పాదములు గలవు. దండకమునకు యతి లేదు. కాని 27 అక్షరముల వృత్తములకు తెలుగులో యతినుంచుట సామాన్యము.. కావున నేను ప్రాసతో, అక్షరసామ్య యతితో క్రింద రెండు ఉదాహరణములను ఇచ్చినాను. 

ప్రచిత - న/న/(య)7 IIII IIIU - UIU UIU - UIU UIU - UIU UIUU 

హరి నిను దలువఁగా - హర్షముల్ గల్గుఁగా - నాశ లాభమ్ముతో - నందమై వెల్గుఁగాదా  
వరదుని బిలువఁగా - వంద నాదమ్ములన్ - వర్ణముల్ చిందుఁగా - పద్యముల్ చిమ్ముఁగాదా  
మురహర యనఁగ నా - మోములో నవ్వులే - పొంగు సంద్రమ్ములే - పూర్ణ సౌందర్య దీప్తుల్  
దరిసెన మొసఁగరా - దారి నీవేగదా - ద్వార మీవేగదా - త్రాహి సర్వోత్తమా రా 

కలలు నిజమగునో - కాంక్ష లీడేరునో - కల్పవృక్షమ్ములోఁ - గాంచ బంగారు పూలై 
లలిత లలితముగా - లాస్య మాడంగ నా - రత్నసౌధమ్ములో - రంజిలన్ సాధ్యమౌనా 
తెలుఁగు పదములతోఁ - దేటతెల్లమ్ముగాఁ - దేనె లొల్కంగ మ-త్తియ్యఁగాఁ బాడవేలా 
చెలువ మలరఁగ నీ - చిత్త మానందమై - చింది యందమ్ములన్ - శృంగమున్ జేరుఁ గాదా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
prachita daMDakamu - 

aadhAramu - jayadEva ChaMdassu 
iMdulO pAdamunaku 27 axaramulu galavu. pAdamunaku reMDu na-gaNamulu, EDu ya-gaNamulu. ee daMDakamunaku vRttamulavale nAlugu pAdamulu galavu. daMDakamunaku yati lEdu. kAni 27 axaramula vRttamulaku telugulO yatinuMchuTa sAmAnyamu. kAvuna nEnu prAsatO, axarasAmya yatitO kriMda reMDu udAharaNamulanu ichchinAnu. 

prachita - na/na/(ya)7 #IIII IIIU - UIU UIU - UIU UIU - UIU UIUU# 

hari ninu daluva@MgA - harshamul galgu@MgA - nASa lAbhammutO - naMdamai velgu@MgAdA  
varaduni biluva@MgA - vaMda nAdammulan - varNamul chiMdu@MgA - padyamul chimmu@MgAdA  
murahara yana@Mga nA - mOmulO navvulE - poMgu saMdrammulE - pUrNa sauMdarya dIptul  
darisena mosa@MgarA - dAri nIvEgadA - dvAra mIvEgadA - trAhi sarvOttamA rA 

kalalu nijamagunO - kAMxa lIDErunO - kalpavRxammulO@M - gAMcha baMgAru pUlai 
lalita lalitamugA - lAsya mADaMga nA - ratnasaudhammulO - raMjilan sAdhyamaunA 
telu@Mgu padamulatO@M - dETatellammugA@M - dEne lolkaMga ma-ttiyya@MgA@M bADavElA 
cheluva malara@Mga nI - chitta mAnaMdamai - chiMdi yaMdammulan - SRMgamun jEru@M gAdA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAVu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: