[racchabanda] సుమకేసరము #sumakEsaramu#

 

సుమకేసరము - 

సుకేసర లేక ప్రభద్రక వృత్తమును మీకు 1 జూలై 2016 పరిచయము చేసినాను. దానికి మఱొక ఉదాహరణము - 

సుకేసర లేక ప్రభద్రక - న/జ/భ/జ/ర 
15 అతిశక్వరి 11184 

IIII UIU III - UIUIU చంపకమాలవలె 

మధురము మాధవమ్ము గద - మంజులమ్ముగా 
సుధలను జిందుచుండె నతి - సుందరమ్ముగా 
వదలఁగఁ జాల నిన్ను మది - వాసుదేవ నీ 
కదలను జెప్పు నాకుఁ గల - గానమయ్యెడున్ 

IIII UIUI - IIUI UIU విఱుపుతో 

మధురము మాధవమ్ము - మదనోత్సవమ్ములే 
సుధలను జిందుచుండె - సుమరాశి తావితో 
వదలఁగఁ జాల నిన్ను - వదనమ్ముఁ జూపుమా 
కదలను జెప్పు నాకు - కమలాక్ష కమ్మఁగా 

సుకేసరములోని మొదటి రెండు లఘువులను ఒక గురువుగా చేద్దామా? అలా చేయగా లభించిన వృత్తమును సుమకేసరము అని పిలువ దలచినను. 

సుమకేసరము - భ/ర/న/ర/లగ UII UIU III UIUIU
14 శక్వరి 5591

UII UIU III - UIUIU ఉత్పలమాలవలె 

రాగసుధారసమ్ము మది - త్రాగుచుండె నీ 
యోగము నాది యయ్యె పెఱ - యోగమేలకో 
భోగము నాకు నబ్బెఁగద - పుణ్య మిద్ది యే 
యాగము సేయఁగా నవని-యందుఁ బ్రాప్తమౌ 

చంద్రుని సోదరీ యమృత - సారమిమ్ము నా- 
కేంద్రుని చెల్లి కల్పసుమ - కేసరమ్ములన్ 
దంద్రపు సంధ్యలో నొసఁగు - త్రాగు నీటిలో 
సంద్రపు తీరమందు సర-సమ్ము లాడుచున్ 

UII UIUI - IIUI UIU విఱుపుతో 

నవ్వకు మిప్పు డిట్లు - నను జూచి నవ్వ కా 
పువ్వుల నేరలేను - పులకించి పోవఁగా 
దివ్వెల వెల్గులోన - తెలఁబోయె దృక్కులే 
మువ్వల మ్రోఁతలోని - ముదమందు వ్రాలెదన్ 

మ్రోడు చిగుర్చగాను - బువులందు రంగులన్ 
జూడు వసంతమందు - సుమకేసరమ్ములన్  
వాడిన దెల్ల వెండి - వనమందుఁ గ్రొత్తఁగా 
నాడెను బచ్చగాను - హరుసమ్ము నీయఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sumakEsaramu - 

sukEsara lEka prabhadraka vRttamunu mIku 1 jUlai 2016 parichayamu chEsinAnu. dAniki ma~roka udaaharaNamu - 

sukEsara lEka prabhadraka - na/ja/bha/ja/ra 
15 atiSakvari 11184 

#IIII UIU III - UIUIU# chaMpakamAlavale 

madhuramu mAdhavammu gada - maMjulammugA 
sudhalanu jiMduchuMDe nati - suMdarammugA 
vadala@Mga@M jAla ninnu madi - vAsudEva nI 
kadalanu jeppu nAku@M gala - gAnamayyeDun 

#IIII UIUI - IIUI UIU# vi~ruputO 

madhuramu mAdhavammu - madanOtsavammulE 
sudhalanu jiMduchuMDe - sumarASi tAvitO 
vadala@Mga@M jAla ninnu - vadanammu@M jUpumA 
kadalanu jeppu nAku - kamalAxa kamma@MgA 

sukEsaramulOni modaTi reMDu laghuvulanu oka guruvugA chEddAmA? alA chEyagA labhiMchina vRttamunu sumakEsaramu ani piluva dalachinanu. 

sumakEsaramu - bha/ra/na/ra/laga #UII UIU III UIUIU#
14 Sakvari 5591

#UII UIU III - UIUIU# utpalamAlavale 

rAgasudhArasammu madi - trAguchuMDe nI 
yOgamu nAdi yayye pe~ra - yOgamElakO 
bhOgamu nAku nabbe@Mgada - puNya middi yE 
yAgamu sEya@MgA navani-yaMdu@M brAptamau 

chaMdruni sOdarI yamRta - sAramimmu nA- 
kEMdruni chelli kalpasuma - kEsarammulan 
daMdrapu saMdhyalO nosa@Mgu - trAgu nITilO 
saMdrapu tIramaMdu sara-sammu lADuchun 

#UII UIUI - IIUI UIU# vi~ruputO 

navvaku mippu DiTlu - nanu jUchi navva kA 
puvvula nEralEnu - pulakiMchi pOva@MgA 
divvela velgulOna - tela@MbOye dRkkulE 
muvvala mrO@MtalOni - mudamaMdu vrAledan 

mrODu chigurchagAnu - buvulaMdu raMgulan 
jUDu vasaMtamaMdu - sumakEsarammulan  
vADina della veMDi - vanamaMdu@M grotta@MgA 
nADenu bachchagAnu - harusammu nIya@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: