[racchabanda] తోటక - చర్చరీ #tOTaka - charcharI#

 

తోటక - చర్చరీ 

హోలీ పండుగరోజు చర్చరీ నృత్యమును ఆడుతారనే ఊహ ఉన్నది. సంస్కృతములో మత్తకోకిల వృత్తమును చర్చరీ అని కూడ పిలుస్తారు. కాని తోటక వృత్తమును చర్చరీ అని కూడ  చెప్పుతారు.  తోటక వృత్తములో హోలీ పండుగ! 

నను జూడఁగ రా - నవమోహనుఁడా 
కొనరా మది నీ - కొసఁగన్ నిశిలో 
మనుచుంటినిరా - మథనమ్ములతో 
వినరా సరసా - ప్రియగీతికలన్ 

రసమున్ జిలికెన్ - రజనిన్ శశియున్ 
వసమైతినిరా - వనజాననుఁడా 
మసృణమ్మగు నీ - మదిలోఁ గలనా 
హసనమ్ములతో - హరి రా దరిరా 

నయగారముతో - నటనమ్ములతోఁ  
బ్రియరాగములోఁ - బ్రియ పాడుదమా 
దయఁ జూపుమురా - దరిఁ జేరుమురా 
శయనించఁగ రా - సరసోక్తులతో 

ఇది పున్నమిరా - యిట వెన్నెలరా 
మది పొంగెనురా - మధురోదధియై 
ముదమీయఁగ రా - పులకింతునురా 
మృదులమ్మగు నీ - నృతి చర్చరిరా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
tOTaka - charcharI 

hOlI paMDugarOju charcharI nRtyamunu aaDutAranE ooha unnadi. saMskRtamulO mattakOkila vRttamunu charcharI ani kUDa pilustAru. kAni tOTaka vRttamunu charcharii ani kUDa  chepputAru.  tOTaka vRttamulO hOlI paMDuga! 

nanu jUDa@Mga rA - navamOhanu@MDA 
konarA madi nI - kosa@Mgan niSilO 
manuchuMTinirA - mathanammulatO 
vinarA sarasA - priyagItikalan 

rasamun jiliken - rajanin SaSiyun 
vasamaitinirA - vanajAnanu@MDA 
masRNammagu nI - madilO@M galanA 
hasanammulatO - hari rA darirA 

nayagAramutO - naTanammulatO@M  
briyarAgamulO@M - briya pADudamA 
daya@M jUpumurA - dari@M jErumurA 
SayaniMcha@Mga rA - sarasOktulatO 

idi punnamirA - yiTa vennelarA 
madi poMgenurA - madhurOdadhiyai 
mudamIya@Mga rA - pulakiMtunurA 
mRdulammagu nI - nRti charcharirA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: