[racchabanda] వాణి(నీ) లేక మేదినీ #vANi(nI) lEka mEdinI#

 

వాణి(నీ) లేక మేదినీ - 

ఆధారము - వృత్తరత్నాకరము, హేమచంద్రుడు

వాణి(నీ) లేక మేదినీ - న/జ/భ/జ/ర/గ 
16 అష్టి 11184 

IIII UIU III - UIU IUU చంపకమాలవలె - 

కలకల నాద మింపలరఁ - గమ్మఁగాఁ గవిత్వ 
మ్మలలుగఁ బొంగఁగాఁ ద్వరగ - నంబుజాక్షి రావా 
మలవలె నిన్నుదల్చితిని - మానసమ్మునందున్ 
తెలుఁగున దేనెలూరగను - దీపి నింపు వాణీ 

మనమున నిన్ను దల్వ నిఁక - మాట లేల నాకున్ 
వినఁగను నీదు వాక్కులను - బ్రేమ నిండె నాలోఁ 
గనఁగను మేదినిన్ గవిత - కంపనమ్ము నిండెన్ 
నెనరున బుట్టి సంతసము - నిండి పొంగి పొర్లెన్ 

III IU IU III - UI UI UU త్ర్యస్రగతిలో - 

ప్రణయములో ముదమ్ము నిడ - రమ్ము వేగ రాణీ 
వినుము సకీ పదమ్ములను - బ్రేమతోఁ బ్రియమ్మై 
వనజముఖీ సదా యమృత - వాణి నీదె గాదా 
తనన తనా తానా తనన - తాన తాన తానా 

వదనములో సదా నవులు - వంద పూల వెల్గై 
హృదయములో మధూదయపు - నృత్య మయ్యె విందై 
సదమలమౌ సుధారసము - సంతసంపు ధారల్ 
ముదమిడు నీ వసంతమున - బూలబాల లెందున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు 
#
vANi(nI) lEka mEdinI - 

aadhAramu - vRttaratnAkaramu, hEmachaMdruDu

vANi(nI) lEka mEdinI - na/ja/bha/ja/ra/ga 
16 ashTi 11184 

#IIII UIU III - UIU IUU# chaMpakamAlavale - 

kalakala nAda miMpalara@M - gamma@MgA@M gavitva 
mmalaluga@M boMga@mgA@M dvaraga - naMbujAxi rAvA 
malavale ninnudalchitini - mAnasammunaMdun 
telu@Mguna dEnelUraganu - dIpi niMpu vANI 

manamuna ninnu dalva ni@Mka - mATa lEla nAkun 
vina@Mganu nIdu vAkkulanu - brEma niMDe nAlO@M 
gana@Mganu mEdinin gavita - kaMpanammu niMDen 
nenaruna buTTi saMtasamu - niMDi poMgi porlen 

#III IU IU III - UI UI UU# tryasragatilO - 

praNayamulO mudammu niDa - rammu vEga rANI 
vinumu sakI padammulanu - brEmatO@M briyammai 
vanajamukhI sadA yamRta - vANi nIde gAdA 
tanana tanA tAnA tanana - tAna tAna tAnA 

vadanamulO sadA navulu - vaMda pUla velgai 
hRdayamulO madhUdayapu - nRtya mayye viMdai 
sadamalamau sudhArasamu - saMtasaMpu dhAral 
mudamiDu nI vasaMtamuna - bUlabAla leMdun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: