www.telugubhakti.com Digest Number 4605

2 Messages

Digest #4605

Messages

Sat Mar 10, 2018 8:53 am (PST) . Posted by:

jajisarma

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 1
1. కృష్ణనిర్యాణ వార్తని మోసుకొచ్చి చెప్పడానికి సందేహిస్తున్న అర్జూనుని చూచి ధర్మ రాజు అన్నమాటలివి. మనం ఏ పనులు చేస్తే తల దించుకోవాలో చెప్తున్నాడు
కచ్చిన్నాభిహతోऽభావైః శబ్దాదిభిరమఙ్గలైః
న దత్తముక్తమర్థిభ్య ఆశయా యత్ప్రతిశ్రుతమ్


చెప్పకూడని అనుకోకూడని విషయాలయందు మనసు పెట్టావా. వినకూడని దాన్ని విన్నప్పుడు, తినకూడని దాన్ని తిన్నప్పుడు, చూడకూడని దాన్ని చూచినపుడు మనసు చిన్నబోతుంది. మనప్రమేయం లేకుండా ఇలాంటి విషయం మనకి అనుభవింపచేసాడంటే దానికి మనం చేసిన ఏ పాపం కారణమో అని అర్థం. అధర్మం ఆచరించే దగ్గర గాని, అధర్మం ఎక్కువగా ఉన్నపుడు గాని మన పుట్టుక ఉంటే మనం పాపం చేసిన వాళ్ళమే. ఇలాంటివి విన్నప్పుడో చూచినప్పుడో తిన్నప్పుడో పరమాత్మ నామాలని తలుచుకోవాలి
ఎమైనా ఇస్తానని చెప్పి ఇవ్వలేదా? వారి మనసులో ఆశ కల్పించి నీవు ఇవ్వలేదా? అభయాన్ని ఇవ్వవలసిన నీవు - బ్రాహ్మణులకు బాలురకు గోవుని వృధ్ధున్ని రోగిష్టిని స్త్రీలను. వీరు శరణు కోరితే ఇవ్వలేదా. పొందకూడని స్త్రీని వదిలిపెట్టావా. పొందవలసిన స్త్రీని వదిలిపెట్టావా. పొరబాటున దారిలో వస్తుంటే నీకన్నా తక్కువ వారితో ఓడిపోయావా. తినవలసిన వృధ్ధులు పిల్లలు ఉండగా వారిని వదిలిపెట్టి తిన్నావా. ఆకలిగొన్న వారు ఉండగా వరిని వదిలి నీవు తిన్నావా. ద్వారంలో అథితి ఉండగా ఆపోశనం, నీరు తాగితే అది మద్యంతో సమానం. పది మందీ అసహ్యించుకునే పని నీవు చేయదగని పనినీ చేసావా. నీకు బాగా ఇష్టమైన వారితో ఎడబాటు పొందావా.


2.
పరీక్షిన్మహారాజు విజయ యాత్రల కోసమని బయలు దేరి మార్గమధ్యంలో - భూమి ధర్మం. గోరూపంలో, వృష రూపం. వారిద్దరినీ దూరం నుంచి తన్న బోతున్నటువంటి విషయాన్ని చూచి, ఎవరు ఈ పని చేస్తున్నారు. అర్జనుని యొక్క కౌరవ వంశంలో ఉన్నవారి పరిపాలనలో ఇలా జరగడానికి వీలు లేదు . ఎవరిలా చేశారు
అప్పుడు ధర్మం ఇలా చెబుతుంది
ఎవరు మీకు ఇలాంటి అవస్థ కలిగించారని మీరు అడిగారు కానీ, ఒక్క మాకే కాదు ఈ ప్రకృతిలోనే సుఖాలకు గాని కష్టములకి కాని వాటిని కలిగించే కర్మలకు గాని కారణం ఇది అని చెప్పలేమి ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఈ పని ఎందుకు జరింగింది అంటే వందమంది వంద కారణాలు చెబుతారు. కనుక మాకు కలిగిన దానికి ఇదీ కారణం అని చెప్పలేము
నీవు ధర్మానివే ఎందుకంటే - బాధ పడుతూ , నిన్ను ఇంత వేదనకు గురిచేసిన్ వాడిని శిక్షిస్తానని అన్నప్పుడు , 'దీని వల్ల కారణమని చెప్పలేను అన్నావు" వృషరూపంలో ఉన్న నీవు ధర్మానివే
ఫలానావాడు నాకు ఈ అపకారం చేసాడని నీవెందుకు చెప్పలేకపోతున్నావో నేను ఊహించగలను. వీడు అధర్మం చేసాడని సూచించిన వాడికి కూడా అధర్మ దోషం వస్తుంది.
అందుకే చేతనైతే ఎదుటివాడిన్ స్తోత్రం చేయమని ధర్మ శాస్త్రం. అందువల్ల ఆ మహాత్ములు ఆచరించిన పుణ్యంలో కొంత భాగం మనకు వస్తుంది. పొరబాటున కూడా నిందించకు విమర్శించకు. చేసిన తప్పుకు గాని చేయని తప్పుకు గాని నిందించితే అకారణంగా ఆ తప్పులోని భాగం నీకు కూడా వస్తుంది .


3. ప్రాణములేని వాటికి కూడా కోరికలు ఉంటాయి. కదలిక లేనంతా మాత్రాన జీవాత్మలేనట్లు కాదు.
పెద్దపులి గాని చిన్న పులి గాని తాను తినవలసిన జంతువు ఎదురుగా ఉంటే దాని ఎదురుగా ఉంటుంది కదలకుండా. ఎంత సేపంటే ఆ జంతువుకి ఇది ప్రాణం లేని జంతువు అని నమ్మకం కుదిరేదాక. అది ముందుకు అడుగేయగానే పులి దాని మీద పడుతుంది. ఎదుటివాన్ని తన వశం చేసుకోవడానికి తనలో ఉన్న చైతన్యాన్ని చలనాన్ని ప్రణాన్ని మరుగు పరిచి స్థావరంలాగ ఉన్న జీవులు తరువాతి జన్మలో స్థావరం గానే పుడతారు. చలనం లేని వాటికి కోరికలుండవని స్థావరములకు ఆశలుండవని అనుకోవధ్ధు. అత్రిమహర్షి ఆశ్రమానికి కొంచెం దూరం ఉండగా రాముడు చెమట పడుతున్నదని ఒక రాతిమీద కూర్చుంటాడు. లక్ష్మణుడికి ఒక అనుమానం వచ్చి 'అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడికి 10 నిముషాలే దూరం ఉంది. ఈ మాత్రానికి ఇక్కడికెందుకు కూర్చున్నారూ అని అడుగగా. 'మనం చిత్రకూటంలో ఉండగా మరీచుడు లేడి రూపంలో వచ్చాడు (రావణుడు పంపగా). నేను బాణం తీయగానే పారిపోయాడు. పారిపోతూ అలసి ఈ రాయిమీద విశ్రమించాడు. ఇక్కడ నేను కూర్చుంటే నేను వాడి దగ్గరకు వస్తున్నట్లు వాడికి సమాచరమొచ్చి తపస్సు కొంచెం పెంచుతాడు. ఈ శిల అయోధ్యా నగరంలో నా అంతపురంలో మణిమయ మండపాన్ని నిర్మించింది ఈ శిల్పియే. వాడికి మోక్షం ఇవ్వడానికి, మరీచుడికి సంకేతం ఇవ్వడానికీ ఇక్కడ కూర్చున్నా' అని అన్నాడు.


4. కలి ప్రధమ లక్షణం లోభం. లోభాన్ని పోషించుకోవడానికి అబద్దం, చౌర్యం, అనార్యం (దుర్జనత), అమ్హ (పాపం), మాయ (మోసం), కలహం, ధంభం (ఇంద్రియాలను మూసుకుని మనసుతో ఇంద్రియ విషయాలని ఆలోచిస్తూ ఉండటం ధంభం)
జ్ఞ్యానం కావలనుకున్నవాడెవ్వడు వీటిని సేవించకూడదు
1. జ్యూదం 2. పానం 3. స్త్రీ 4. పశు హింస 5. బంగారం 6. అబద్దం 7. మదం 8 కోరిక 9. రజో గుణం 10. వైరం.
సామాన్యులు సేవించడం కన్నా రాజు సేవించడం వలన ప్రమాదం ఎక్కువ


5. ఈ పరీక్షిత్తు బ్రహ్మదండంతో కూడ దండింపబడని వాడు, అత్యాశ్చర్య కరములైన పనులు చేసే కృష్ణపరమాత్మ చేత కాపాడబడ్డాడు.
ఈయన రెండు రకాల గొప్పవాడు 1. బ్రహ్మాస్త్రం చేత దహింపబడలేదు భయపడలేదు 2. బ్రహ్మ దండానికి (శాపానికీ) భయపడలేదు.
ఈయన మరణానికి భయపడలేదు. ఓంటి స్తంభం మేడలో ఉన్నడని చెప్పిన కథ వాస్తవం కాజాలదు. ఇంత ఉదాత్తంగా ప్రవర్తించినవాడు కలి పురుషున్ని శాసించినవాడు బ్రహ్మ శాపాన్నుంచి తప్పించుకోచూడ జాలడు.


6. శిష్యులు ఎప్పుడు గురువు గారి దేహాన్ని జాగ్రత్తగా చూడాలి. గురువుగారు శిష్యుడి ఆత్మను గురువు కాపాడాలి


7. తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః


ఈ శ్లోకం మనం రోజూ చదువుకోవాలి
పరమాత్మనే ఎప్పుడూ సేవించాలనే కోరిక ఉన్న మహానుభావునితో క్షణకాల కలయికతో లక్షలో లక్ష అంశలో కూడా స్వర్గం అపునర్భవం సాటి రావు. భక్తులతో ఒక్క క్షణం కలిసి ఉండే ఫలములోని కోటి యొక్క అంశతో స్వర్గము అపునర్భవమూ సాటి రావు


8. విలోమం : క్షత్రియుడి వలన బ్రాహ్మన స్త్రీకి పుట్టే వాడు. అనులోమం - బ్రాహ్మణుడి వలన క్షత్రియురాలికి పుట్టే వాడిని. సూతుడు స్త్రీ పురుష సమ్యోగంతో పుట్టినవాడు కాడు. పృధు చక్రవర్తి చేసిన యజ్ఞ్యంలో అగ్నిహోత్రునికి స్వాహాకారం ఇస్తూ ఇంద్ర మంత్రాన్ని పొరబాటున చదివాడు. ఇంద్రుడు క్షత్రియుడు అగ్ని బ్రాహ్మణుడు. క్షత్రియ బీజంతో బ్రాహ్మణ క్షేత్రంలో పుట్టినవాడు సూతుడు. ఎలాంటి పాపం చేయని నాకు ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చి శిక్షించారని అడిగితే - ప్రధానమైన అగ్ని హోత్రానికి పుట్టావు కాబట్టి, అగ్నిహోత్రం జ్ఞ్యానాన్ని అందిస్తుంది కాబట్టి అందరికీ జ్ఞ్యానాన్ని అందిస్తావు


9. నిజముగా ప్రాణాయామం చేస్తే మన చుట్టుపక్కల ఉన్న శబ్దాలు వినపడకూడదు, స్పర్శ తెలియకూడదు. అయిదు విషయాలు తెలియకూడదు. మనసును కూడా అరికట్టాలి. ఏ ఇంద్రియం పని చేయడం మానేసిందో ఆ ఇంద్రియ శక్తి మనసుకు సంక్రమిస్తుంది. మనం మానేసిన దాన్ని మనసు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకు మనసుని అరికట్టాలి. బుధ్ధిని కూడా అరికట్టాలి. బుధ్ధి ఏమీ అలోచించకుండా మనసు ఏమి సంకల్పించకుండా ఇంద్రియాలు ఏ విషయాలలో ప్రవర్తించకుండా ఉండటం ప్రాణాయామం.10. ఎవడు లోకాన్ని చూచి భయపడడో, లోకములు ఎవడిని చూచి భయపడవో తానే బ్రహ్మ. ఆపద కలిగించే వాడు ఆపద కలిగించేది అన్న వేరు భావన ఉన్నవాడు బ్రహ్మాత్మకం జగదిదం అనుకోలేడు. తాను ఏది కోరక ఎదుటివాడిలో భేధభావన చూపని వాడు బ్రహ్మ. పొందవలసినది ఏదీ లేక పొందాలన్న కోరిక లేని వాడు.
Sat Mar 10, 2018 8:56 am (PST) . Posted by:

jajisarma

అర్చన
శ్రీ కృష్ణామృతం
శంఖ, చక్ర, గదా, పద్మధరం
శ్రీ భూపతిం హరిమ్
నమామి కేశవం దేవం
సర్వాలంకార సంయుతం
శ్రీకృష్ణుడు అనంతకోటి బ్రహ్మాండాలకు అధీశ్వరుడు. శ్రీకృష్ణుడు శ్రీముఖనామ సంవత్సర, దక్షిణాయనం, వర్షఋతువు, శ్రావణ బహుళ అష్టమి, రోహిణీ నక్షత్రం నాలుగో పాదము, బుధవారము, అర్ధరాత్రివేళ మధురలో కారాగారములో యదువంశములో దేవకీ, వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు. అష్టమినాడు జన్మించిన శ్రీకృష్ణుడికి ఎనిమిదితో చాలా అనుబంధం ఉంది. శ్రావణ బహుళ అష్టమి. శ్రీకృష్ణుని జయంతి అష్టమి 8వ తిధి. ఓం నమో నారాయణాయ 8 అక్షరములుగల మంత్రము. దశావతారములలో 8వ అవతారం శ్రీకృష్ణావతారము. దేవకీదేవికి శ్రీకృష్ణుడు 8వ సంతానం. ఆయన జన్మస్థానమైన చెరసాలకు 8 ద్వారములుగలవు. అతని ధర్మపత్నులు 8 మంది. అతని జీవనకాలము 125 సంవత్సరములు.. ఈ మూడు అంకెలు కూడితే వచ్చే సంఖ్య 8.
జీవుని యందలి భౌతిక వాసనలు పోగొట్టు శక్తియే శ్రీకృష్ణుడు. కృష్ణుడంటే పరబ్రహ్మ, పరమ పురుష, పరాత్పర, పరమాత్మ, పరంధామ, పరంజ్యోతి, పరమేశ్వరుడు. అతడు శుద్ధ సత్వరూపుడు. జగత్తులోని సర్వజీవులను ఉద్ధరించుట కొరకు అవతరించిన దేవదేవుడు.
ధర్మ సంస్థాపన కొరకు అవతరించిన శ్రీకృష్ణుని లీలలు మహిమాన్వితములు. అతని ప్రతిలీలకు అర్థం, పరమార్థం వుంది.
ధర్మమును (పాండవులను) రక్షించటానికి, అధర్మమును (కౌరవులను) శిక్షించటానికి వచ్చిన అవతార పురుషుడు అతడు బాలునిగా వున్నప్పుడే శకటాసురుని దేహాభిమాన్ని, తృణావర్తుని బుద్ధిభ్రమణాన్ని బకాసురుని కుటిలతను, అఘాసురుని పాపాన్ని, చాణార, ముష్టికాసురుల కామక్రోధములను, కంసుని అహంకారాన్ని సంహరించాడు. పూతన గర్వమును అణచినాడు. బ్రహ్మదేవుడు తన మాయ ద్వారా గోవులను మాయంచేయగా, అన్ని రూపాలు తనే అయి అతని అహంకారమును అణచెను.
అతని ఆయుధములు:-
1. సుదర్శన చక్రము: ఇది కాలానికి, అగ్నితత్వానికి సంకేతం.
2. పాంచజన్యము (శంఖము): ఇది జలతత్వానికి, నాదానికి సంకేతం.
3. కౌమోదకీ (గద): ఇది జగత్తుకు ఆధారమైన చైతన్యశక్తికి, జగత్తును ధరించే శక్తికి సంకేతం.
4. పద్మం: ఇది జ్ఞానానికి, సంపదకు, సత్వగుణమునకు సంకేతం.
శ్రీకృష్ణుని రథమును లాగుతువుండే నాలుగు అశ్వములు - శైబ్య, సుగ్రీవము, మేఘ పుష్పము, బలాహకము.
కాలస్వరూపుడు శ్రీకృష్ణుడు. కోటి భవన న్నామములతో సమానం అని గర్గుని వచనం.
''భూత భవ్య భవత్ప్ర భుః'' - అని విష్ణు సహస్రం స్పష్టపరచింది. సర్వపాపములను 'కర్షణము' (లాగివేయుట) చేసి అనుగ్రహించేవాడు. బలరామకృష్ణులకు గండు ఉపశయనము, సాందీపుడు విద్యను వొసంగిరి. సాందీపునికి గురుదక్షిణగా అతని పుత్రుని యమపురినుండి రక్షించాడు.
శ్రీకృష్ణుని మెడ యందు పంచవర్ణ పుష్పగ్రధితమైన వైజయంతి మాలగలదు. వైజయంతి అనగా తులసి, కుంద, మందార, పారిజాత, సరోజాలు - ఈ ఐదురకముల పుష్పములతో కూర్చిన మాల అని అర్థము. పంచరసాలతో నిర్మితమాల అని శాస్త్రగ్రంథములు పేర్కొన్నాయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి - వీటి తన్మాత్రలు అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గందాధులతో కూడిన హారం వైజయంతీమాల.
శ్రీకృష్ణుని పూజలో
1. విగ్రహమునకు చందనం పూయుట - ఇది పృధివీతత్వం. ధూపముకూడా పృధివీతత్వమే.
2. తీర్థం - జలతత్వానికి
3. దీపారాధన - అగ్నితత్వానికి
4. వింజామరం వీచుట - వాయుతత్వానికి
5. గంట మ్రోగించుట - ఆకాశతత్వానికి - అనగా పంచభూతముల సమగ్ర సారాన్ని భగవంతునకు నివేదిస్తారు.
జలము స్థానముగా గలవాడు. కనుక నారాయణుడు. అనగా నారాయణుడు రహాశ్రయ భూతుడు. ''రసోవైసలి'' అని చెప్పుటవలన నారాయణ రూపుడైన శ్రీకృష్ణుడు కూడా రసస్వరూపుడు. గోపికా వస్త్రాపహరణము, కాళీయమర్దన్, బృందావనంలో రాసలీల జరిపించి అందరికి ఆనందము కలిగించాడు.
కృష్ణునికి ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లులు పేర్లు వర్తించాయి. వాసుదేవుడు, దేవకీనందనుడు, నందనందనుడు, యశోదానందనుడు.
చిన్నికృష్ణుడు స్నేహితులతో కలిసి వెన్న దొంగిలించేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. అందరి ఇళ్ళలో నల్లని కుండలను పగలకొట్టి వానిలో వున్న తెల్లని వెన్నను తాను తింటూ తన చెలికాండ్రకు పంచేవాడు. దీని అర్థము - మృణ్మయ రూపమైన మానవ శరీరమే మృత్తికారుపమైన వెన్నకుండ. మనలోని మనస్సే కుండలోని వెన్న. నల్లని కుండ అజ్ఞానమునకు గుర్తు. తెల్లని వెన్న వెలుగునకు, విజ్ఞానమునకు గుర్తు. అజ్ఞానము అనే చీకటిని చేధించి, తెల్లటి జ్ఞానామృతమును సాధించాలనేదే శ్రీకృష్ణుని సందేశం.
గోపికలు కడవలతో నీళ్ళు తీసుకొని వెళుతుంటే ఆ కుండలకు రాళ్ళు విసిరి, కుండలలోని నీరుకారిపోయేటట్లు చేసేవాడు. కుండలలో నీరు ఎలా నిండివుందో మన శరీరములలోను ''అహంకారం'' అనే నీరు నిండివుంది. అహంకారం పోనిదే జీవికి ముక్తిలేదు అని తెలియచేయటమే శ్రీకృష్ణుని ఆ చర్యలోని ఆంతర్యం. యశోద మన్ను తిన్నావని దండించగా, అతను నోరు తెరచి విశ్వమును చూపించాడు.
దేవేంద్రుడు రాళ్ళవాన కురిపించగా శ్రీకృష్ణుడు గోవర్థనపర్వతమును ఏడురోజులు ఎత్తి (చిటికన వ్రేలితో) దేవేంద్రుని గర్వం అణచినాడు. గోపగోపీ జనమును కాపాడాడు. బాల్య చెలికాడు కుచేలునకు అతను తెచ్చిన అటుకులు స్వీకరించి అతనికి సర్వసంపదలు ఇచ్చాడు.
రాజసూయయాగంలో అగ్రపూజకు భీష్మపితామహుడు శ్రీకృష్ణుని పరు ప్రతిపాదించగా ఏకగ్రీవంగా అగ్రపూజ జరిగింది. ఈ యాగంలో కాళ్ళు కడిగే పనిని శ్రీకృష్ణుడు ఎన్నుకోవటం, సాయంత్రం యుద్ధము ఆగిన తర్వాత గుర్రముల గాయములు కడిగి, మందు పూయటం విశేషం. అది అతని నమ్రతకు నిదర్శనం.
ఒకరోజు బలరాముడు, శ్రీకృష్ణుడు ఆడుకొనుచుండగా నేరేడుపళ్ళు అమ్మే ఆమె వచ్చింది. ఆమెకు ఇంట్లో వున్న ధాన్యము తన గుప్పెడుతో తీసుకొని వచ్చుచుండగా, కొన్ని ధాన్యము గింజలు దారిలో పడినవి. మిగిలిన కొద్ది ధాన్యము గింజలను నేరేడు పళ్ళు ఆకుకు ఇచ్చి, నేరేడు పళ్ళు తీసుకొన్నాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ధాన్యపు గింజలు రత్నాలుగా మారి ఉన్నాయి. అంటే కృష్ణుడు తనకు భక్తితో అర్పించిన ప్రతిదీ వేయిరెట్లుగా పెరిగి అర్పించిన వారికి తిరిగి వస్తుందని ఈ చిన్న సంఘటన ద్వారా శ్రీకృష్ణుడు తెలియజేశాడు.
కృష్ణుడు అనుబంధం యశోదతోనే, తన బాల్యంలోనే చాలా మహిబలు చూపినాడు. యశోద సామాన్యురాలైన తల్లిగానే వ్యవహరించింది. కృష్ణుని మహిమలు చూడని దేవకి మాత్రం శ్రీకృష్ణుని భగవంతునిగానే కొలిచింది. కృష్ణుడు పెద్దవాడైనాక, కంసుని చేతిలో హతులైన తన పుత్రులను పునర్జీవులుగా చేయమని ప్రార్థించగా, వారిని పునర్జీవులుగా చేసి తల్లి ఋణమును తీర్చుకొన్నాడు.
చైతన్యమఠం, మధ్యమఠం కర్నాటకలోని ఉడిపి మఠం, మధుర, బృందావనం, కేరళలోని గురువాయూర్, గుజరాత్‌లోని ద్వారకలలో అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మానవ జన్మతరించుటకు భగవద్గీత ద్వారా సందేశమిచ్చెను.
''యద్గత్వాన నివర్తనే్త తద్దామ పరమం మమ''
ఎవరైతే తనను స్మరిస్తూ విగతజీవులై తిరిగి రారో, ఆ పరమపదం తనదని స్పష్టం చేశాడు కృష్ణపరమాత్మ.

'' సర్వం శ్రీకృష్ణ చరణార్పణమస్తు''
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

No comments: