www.telugubhakti.com Digest Number 4617

2 Messages

Digest #4617
1a
Re: Dharma Pathni Qualities. by "ras sastry" sastry1951
1b
Re: Dharma Pathni Qualities. by "ras sastry" sastry1951

Messages

Sun Mar 25, 2018 8:25 am (PDT) . Posted by:

"ras sastry" sastry1951

మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు
క్రింది విదంగా ఉంటాయి .

(1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు )

*కార్యేషు యోగీ :*
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
*కరణేషు దక్షః *
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో
వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
* రూపేచ కృష్ణః*
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.
* క్షమయా తు రామః*
ఓర్పులో రామునిలాగా ఉండాలి.
*భోజ్యేషు తృప్తః*
భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి.
*సుఖదుఃఖ మిత్రం*
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు
పంచుకోవాలి.

ఈ ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త కొనియాడబడతాడు.

(2). శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (ఉత్తమ భార్య లక్షణాలు)

* కార్యేషు దాసీ*
పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు
చెయ్యాలి.
*కరణేషు మంత్రీ*
మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.
* రూపేచ లక్ష్మీ*
రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ
సంతోషంగా ఉండాలి.
*క్షమయా ధరిత్రీ*
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ
పని చేయకూడదు.
*భోజ్యేషు మాతా*
భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.
*శయనేషు రంభా*
పడకటింటి లో రంభ లాగా ఉండాలి.
ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.


పై నీతి శ్లోకాలలో ఉత్తమ భర్త లక్షణాలు గురించి మన0
చెప్పుకోవలసిన అవసరం లేదు . ఎందుకంటే మన దేశం లోని ప్రజలు ఎప్పుడూ వాటి
గురించి ప్రస్తావించరు. ఇక ఉత్తమ భార్య లక్షణాలలో కూడా రూపేచ లక్ష్మి , క్షమయా
ధరిత్రి అనే వాటిని వదిలేసి మిగతా నాలుగు లక్షణాలని ఎక్కువ ప్రాచుర్యం లోకి
తెచ్చారు . ఆలా తెచ్చిన వారు భారత దేశం లోని భర్తలు అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే వారికి ఉత్తమ పతులు గా ఉండాలంటేనే కుదరని పని కాబట్టి , ఒక వేళా తమ
భార్యలను ఉత్తమ పత్నులు గా ఉండాలని భార్యల ఎదుట " కార్యేషు దాసీ" అనే శ్లోకం
తాత్పర్య సహితంగా చెపితే , వెంటనే "కార్యేషు యోగీ," అనే శ్లోకం తాత్పర్య
సహితంగా వచ్చి ముఖానికి తగులుతుందేమో అనే భయంతో అసలు నీతి శాస్త్రాన్నే మననం
చేసుకోవడం మాని వేశారు కాబోలు . ఈ నీతులు, శాస్త్రాల గోలేమి లేకుండా "
సర్దుకు పోయి సంసారం చేసే వారే మంచి మొగుడూ పెళ్ళాలు " అనే అభిప్రాయానికి
వచ్చేసారు.

అయితే ఎవరికీ పనికి రాని నీతి శాస్త్రం లోని ఉత్తమ పత్ని తాలూకు శ్లోకం
ఇండియాలోని విదేశీ ప్రేరేపిత స్త్రీ వాదులకు మాత్రం చక్కగా పనికొచ్చింది
..భారత సమాజానికి ఆయువు పట్టుగా ఉన్న కుటుంబ వ్యవస్థను దెబ్బ తీయాలంటే భార్యా
భర్తల మధ్య తంపులు పెట్టందే సాధ్యం కాదు అని భావించిన కుట్రవాదులు నీతి
శాస్త్రం లోని శ్లోకం ని తమ భావజాలానికి అనుకూలంగా మార్చి నెగటివ్
గా ప్రచారం చేయడం ప్రారంభించారు . ఆ ప్రచారం లో కూడా కేవలం 4 లక్షణాలు
గురించి మాత్రమే చెప్పడం మొదలు పెట్టారు . అందుకే పై శ్లోకం లో ప్రస్తుతం
ఎక్కువ వాడుకలో ఉన్న మాటలు ఏమిటంటే "కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,భోజ్యేషు
మాతా, శయనేషు రంభా" అనేవి మాత్రమే .


ఇలా కుట్రపూరితమైన స్త్రీ వాదుల నెగటివ్ ప్రచారం ఎలా ఉందంటే " భారత దేశం
లో మగవాడు అనాదిగా స్త్రీని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు అనటానికి ఈ
శ్లోకమే మంచి ఉదాహరణ . పగలల్లా దాసిదానిలాగా పనిచేయాలని , రాత్రయితే రంభ లాగ
మారి పడకదిలొ ప్రవర్తించాలని స్త్రీని శాసిస్తున్నాడు మగవాడు . అందుకే స్త్రీ
ఛైతన్యం కోల్పోయి మగవాడికి అడుగులు మడుగులు ఒత్తే బానిసగా మారి పోయింది . ఇక ఈ
దౌర్జన్యం సాగటానికి వీలు లేదు. ఇలాంటి మొగుళ్ళతో కాపురం చేయటం కంటే,
ఆత్మాభిమానం తో ఒంటరిగా జీవించడం మేలు " అని ప్రభోదించడం మొదలు పెట్టారు ,
ఈ తరహా బోధలు వలన చివరకు చాలా కుటుంబాలలో చిచ్చు పెట్టగలిగారు . ఇలా వీరి
మాటలకు మోసపోయి , కావురం కూల్చుకుని , భర్త పిల్లలకు దూరమై , వేశ్యగా మారి ,
చివరకు రాత్రి పూట నడి బజార్లో నగ్నంగా పరుగు తీసి ఇరుగు పొరుగు వారి సహాయం
కోరిన ఒక మహిళ గురించి ఇదే బ్లాగులో ప్రస్తావించడం జరిగింది .
<http://ssmanavu.blogspot.in/2014/12/blog-post_10.html>
ఒక అసత్యాన్ని పలు మార్లు ప్రస్తావిస్తే అదే నిజం అయి తీరుతుందనే నానుడి ని
నిజం చేయడం లో సఫలీ కృతులు అయ్యారు సో కాల్డ్ స్త్రీ వాదులు . కుటుంబ
బాంధవ్యాలు సజావుగా ఉండాలి అంటే ముక్యంగా కావలసింది "సర్దుకుపోయే తత్త్వం
". వీరి నెగటివ్ ప్రచారం వలన , సర్దుకు పోయే గుణం లోపించి , ప్రతి చిన్న
విషయాన్ని భూతద్దం లో చూస్తూ తమ సంసార జీవితాలు నాశనం చేసుకుంటున్న అభాగ్య
స్త్రీలు ఈ నాడు సమాజం లో చాలా మంది ఉన్నారు . ఏ స్త్రీ జనోద్ధరణ అని
చెప్పే T.V సీరియల్ చూసినా , ఏ సినిమా చూసినా "కార్యేషు దాసీ" అనే 4 మాటల
ప్రస్తావన ఉంటుంది . కాకపొతే అది నెగటివ్ గా ప్రచారం అవుతున్నందు వలన
"మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కే " బాపతు కొంతమంది స్త్రీలకు తప్పా , సంసారాలు
చేసుకునే సామాన్య స్త్రీలకు ఉపయోగపడడం లేదు అని నా అభిప్రాయం.

ఆలుమగలు ఎలా ఉండాలో మన పెద్దలు చక్కగా చెప్పిన నీతి శాస్త్రం
లోని "కార్యేషు దాసీ" అనే శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే
శ్లోకం పాపులర్ కాకపోవటానికి కొంతమంది కుటుంబ విచ్చిన్నకర బావజాలికుల
నెగటివ్ ప్రచారమే కారణం .
*రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ **(ఆదోని ఆర్ట్స్
అండ్ సైన్స్ కాలేజి, ఆదోని)*

*R.A.S. Sastry (Retired Principal of The Adoni Arts &Science College,
Adoni), *
*2-629, Srinivasa Nagar, Behind Three Town Police Station, **Opp. Arts
College Auditorium, **Adoni-2 , *
*Kurnool Dt, (Andhra Pradesh) **PIN Code - 518302 *
*My Mobile Nos: +91 94402 44283, 99491 47589 ** Land line home:
08512-231583 *
*My e-mail id: **rassastry@gmail.com* <rassastry@gmail.com>*,
**sastry1951@yahoo.co.in
<sastry1951@yahoo.co.in> *

Sun Mar 25, 2018 8:25 am (PDT) . Posted by:

"ras sastry" sastry1951

మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు
క్రింది విదంగా ఉంటాయి .
(1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు )
*కార్యేషు యోగీ :*
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
*కరణేషు దక్షః *
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో
వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
* రూపేచ కృష్ణః*
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.
* క్షమయా తు రామః*
ఓర్పులో రామునిలాగా ఉండాలి.
*భోజ్యేషు తృప్తః*
భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి.
*సుఖదుఃఖ మిత్రం*
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు
పంచుకోవాలి.
ఈ ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త కొనియాడబడతాడు.
*రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ **(ఆదోని ఆర్ట్స్
అండ్ సైన్స్ కాలేజి, ఆదోని)*

*R.A.S. Sastry (Retired Principal of The Adoni Arts &Science College,
Adoni), *
*2-629, Srinivasa Nagar, Behind Three Town Police Station, **Opp. Arts
College Auditorium, **Adoni-2 , *
*Kurnool Dt, (Andhra Pradesh) **PIN Code - 518302 *
*My Mobile Nos: +91 94402 44283, 99491 47589 ** Land line home:
08512-231583 *
*My e-mail id: **rassastry@gmail.com* <rassastry@gmail.com>*,
**sastry1951@yahoo.co.in
<sastry1951@yahoo.co.in> *
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

No comments: